Gangrene: మీ మగతనాన్ని మింగేయడానికి వస్తోంది ‘‘గ్యాంగ్రీన్‌’’.. ‘దానికే‘ ఎసరు.. అసలేంటి వ్యాధి?

ప్రపంచంలో రోజుకో రకం వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కొత్త కొత్త వ్యాధులు వెలుగు చూస్తున్నాయి. వైరస్‌ల కట్టడికి, వ్యాధుల నియంత్రణకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. రోగాలకు తగిన మందులు తయారు చేస్తున్నారు. అయిన కొన్ని మొండి వ్యాధులు మందులకు లొంగడం లేదు. చికిత్సకు తలొగ్గడం లేదు.

Written By: Raj Shekar, Updated On : September 6, 2024 8:59 am

Gangrene

Follow us on

Gangrene: షుగర్‌ లేదా మధుమేహం లేదా చక్కెర వ్యాధి.. ఈ రోజులు ఈ వ్యాధి సర్వ సాధారణం అయింది. మనం తీసుకునే ఆహారం. జీవన శైలి కారణంగా షుగర్‌ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, జంక్‌ ఫుడ్‌ తదితరాల కారణంగా డయాబెటిస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. వంశపారంపర్యంతోపాటు ఏటా లక్షల మంది కొత్తగా వ్యాధులబారిన పడుతున్నారు. షుగర్‌ వ్యాధి వచ్చినవారిలో ఇతర సమస్యలు పెరుగుతుంటాయి. షుగర్‌ కంట్రోల్‌ తప్పితే.. దాని ప్రభావంతో ఇతర ఆర్గాన్స్‌ కూడా దెబ్బతింటుంటాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. గుండె, కిడ్నీలపై షుగర్‌ వ్యాధి ప్రభావం ఉంటుంది. షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో గుండెపోటు ప్రభావం ఎక్కువ. కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. షుగర్‌ వ్యాధి ప్రభావం అది ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే యూకేకు చెందిన ఓ రోగికి ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకోవల్సి. ముఖ్యంగా అబ్బాయిలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ’అది’ కూడా ఉండదు.

డయాబెటిస్‌ కారణంగా కలిగే ముప్పు..
యూకేకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఇటీవల పీకలదాకా తాగి ఆస్పత్రి పాలయ్యాడు పురుషాంగం వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న అతడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్‌ పరిశీలించిన వైద్యులు.. అతడి పరిస్థితి చూసి షాక్‌ అయ్యారు. అతడి అంగం ముందుంటే స్కిన్‌ (శిశ్నాగ్ర చర్మము) పూర్తిగా కుళ్లిపోయింది అక్కడ చాలా గడ్డలు కనిపించాయి. అవి పొత్తికడుపు వరకు విస్తరించి ఉన్నాయి. దీంతో వైద్యులు వెంటనే అతడికి చికిత్స అందించారు. అప్పటికప్పుడు యాంటీబయాటిక్స్‌ ఇచ్చి.. ఇంటికి పంపేశారు.

తీవ్రమైన జ్వరంతో మళ్లీ ఆస్పత్రికి..
వారం తర్వాత సదరు వ్యక్తి తీవ్రమైన జ్వరంతో మళ్లీ ఆస్పత్రికి వాచ్చడు. అతడి మర్మాంగాల నుంచి చాలా దుర్వాసన వస్తోందని, మూత్రం కూడా కంపు కొడుతోందని డాక్టర్లకు చెప్పాడు. యాంటీబయాటిక్స్‌ ఇచ్చినా సరే.. నయం కాకపోవడంతో డాక్టర్లు అతడికి మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. కుళ్లిన ప్రాంతం వద్ద చర్మం పూర్తిగా పొడిబారిపోయింది. అక్కడ రక్తపు చుక్క కూడా లేదు. దీంతో వెంటనే అతడికి రక్త మార్పిడి చికిత్స నిర్వహించారు. మరోసారి అతడికి యాంటీబయాటిక్స్‌ డోస్‌ ఇచ్చారు. ఇన్సులిన్స్‌ కూడా అందించారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో వైద్యులు తప్పని పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఆ విషయాన్ని చెప్పగానే బాధితుడు షాక్‌ అయ్యాడు. కానీ, అది చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకుని.. తప్పని పరిస్థితుల్లో డాక్టర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

పురుషాంగం తొలగింపు..
రోగి అనుమతితో వైద్యులు.. అతడి పురుషాగంలో ‘గ్యాంగ్రీన్‌’ (కుళ్లిన భాగం) గురైన చర్మం మొత్తాన్ని తొలగించారు. పూర్తి అంగాన్ని తొలగించారు. సర్జరీకి ముందు డాక్టర్లు.. అతడి అంగాన్ని కట్‌ చేయకూడదని భావించారు. కానీ, అక్కడి కణజాలం కుళ్లిపోయి నల్లగా మారడం (నెక్రోసిస్‌)తో కత్తిరించక తప్పలేదు. దీనిపై యూరాలజీ నిపుణులు స్పందిస్తూ.. ‘అంగానికి సమృద్ధిగా రక్తం సరఫరా కాకపోవడం వల్ల.. అక్కడ ’ఇస్కీమిక్‌ గ్యాంగ్రీన్‌’ అభివృద్ధి చెందిందని గుర్తించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇది సెప్సిస్‌కు దారి తీస్తుందని, రోగి ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో కుళ్లిన చర్మానికి తిరిగి జీవం పోసే అవకాశాలేవీ కనిపించలేదు. అవసరమైన కణజాలం అక్కడ లేదు అందుకే, పూర్తిగా అతడి అంగాన్ని తొలగించామని వైద్యులు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రోగికి వివరించామని, అందుకే అతడు చికిత్సకు అంగీకరించాడని తెలిపారు.

గ్యాంగ్రీన్‌ అంటే?
రక్త సరఫరా కోల్పోవడం వల్ల శరీర కణజాలం చనిపోయే ఒక తీవ్రమైన పరిస్థితినే గ్యాంగ్రీన్‌ అంటారు. అది శరీరంలో ఏ భాగంలో అయిన జరుగవచ్చు. కాళ్లు, వేళ్లు చేతులు.. ఇలా ఏ ప్రాంతంలోనైనా గ్యాంగ్రీన్‌ ఏర్పడవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్‌ రోగులకు ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. రక్త సరఫరా నిలిచిపోగానే.. ఆ భాగాల్లో డ్రై గ్యాంగ్రీన్‌ ఏర్పడుతుంది. ఆ తర్వాత అక్కడి కణజాలం చనిపోతుంది. అక్కడ వాపు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ ప్రాంతం ఎర్రగా.. చివరిగా పచ్చగా.. నల్లగా మారుతూ కుళ్లిపోతుంది. 1883లో మొదటిసారి ’ఫోర్నియర్స్‌’ అనే గ్యాంగ్రీన్‌ ను గుర్తించారు. ఇది మాంసాన్ని తినే వ్యాధి బ్యాక్టీరియా సంక్రమణ వలన ఏర్పడుతుంది. మొదట్లో అది పురుషుల వృషణాలపై ప్రభావం చూపుతుందని భావించారు కానీ, అది పూర్తిగా జననేంద్రియాలు, పెరినియం, పాయువుల కణజాలాలకు కూడా వేగంగా వ్యాపిస్తోందని తెలుసుకున్నారు. అది పొత్తి కడుపు వరకు చేరుకుంటే.. జీవితం మీద ఆశలు వదిలేసుకోవల్సిందే.

కారణాలు ఇవే..
అతిగా మద్యం తాగే వ్యక్తులకు ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ ముప్పు ఎక్కువే. ఇది కాళ్లు, పాదాలు, వేళ్లు, చేతులు, జననాంగాలతో సహా ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఎరుపు, ఊదా లేదా నలుపు చర్మం, వాపు, తీవ్రమైన నొప్పి, పుండ్లు లేదా పొక్కులు వంటివి ఏర్పడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. స్మోకింగ్‌ వల్ల కూడా ఈ సమస్యలు రావచ్చు.