https://oktelugu.com/

Eggs: పిల్లలకు కోడిగుడ్డును ఎప్పటి నుంచి తినిపించాలి? ఆ నీలంను ఇవ్వవచ్చా?

ఆరు నెలలు పూర్తిగా నిండిన తర్వాత ఉగ్గు, సాఫ్ట్ ఫుడ్ ను మొదలు పెడుతారు అనే విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈ ఎగ్ ను పిల్లలకు ఇవ్వచ్చు అంటున్నారు నిపుణులు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 8, 2024 12:49 pm
    Eggs

    Eggs

    Follow us on

    Eggs: పిల్లలకు మనం ఇచ్చే ఆహారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటుంది. బయట నుంచి తీసుకొని వచ్చిన ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. ఇక వారి డైలీ లైఫ్ లో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, మాంసం వంటివి ఇవ్వడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది అంటారు డాక్టర్లు. మొత్తం మీద మీరు ఇచ్చే ఆహారం మాత్రమే వారి డైలీ లైఫ్ ను ప్రభావితం చేస్తుంది. అయితే మరీ చిన్న పిల్లలకు అయితే ఉగ్గు నుంచి ఫుడ్ ఇవ్వడం మొదలు పెడతారు.

    ఇక మెల్లమెల్లగా ప్రతి ఒక్క ఫుడ్ ను పిల్లలకు తినిపిస్తారు. మరి అన్ని రకాల ఫుడ్ లను ఇస్తుంటారు.. కానీ ఎగ్ ను ఎప్పుడు పెట్టాలి అనే అనుమానం మీలో చాలా మందికే వచ్చి ఉంటుంది. మీకు ఈ డౌట్ ఉంటే ఈ ఆర్టికల్ ను చదివేసేయండి. ఎగ్ లో ఉండే వైట్ లో చాలా ప్రోటీన్లు ఉంటాయి. ఈ వైట్ తో పాటు ఎల్లో ( నీలం) లో కూడా విటమిన్స్, మినరల్స్, పోషకాలు ఉంటాయి. అయితే ఈ ఎగ్ ను పిల్లలకు 6-9 నెలల మధ్యలో ఎప్పుడైనా ఇవ్వచ్చు.

    ఆరు నెలలు పూర్తిగా నిండిన తర్వాత ఉగ్గు, సాఫ్ట్ ఫుడ్ ను మొదలు పెడుతారు అనే విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈ ఎగ్ ను పిల్లలకు ఇవ్వచ్చు అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్లు పిల్లలకు చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి ఎలాంటి సందేహాలు లేకుండా ఆరు నెలలు నిండిన పిల్లలకు ఎగ్ ను ఇవ్వవచ్చు. కొందరు ఎగ్ లోని నీలంను తినడానికి ఇష్టపడరు. మరికొందరు బరువు పెరుగుతారనే భయంతో తినరు. కానీ పిల్లలకు మాత్రం కచ్చితంగా ఈ ఎల్లోను, వైట్ ను ఇవ్వాలి అంటున్నారు నిపుణులు.

    ప్రతి రోజు ఎగ్ ను ఇవ్వడం వల్ల పిల్లల ఎదుగుదల బాగుంటుంది. అంతేకాదు వారికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఈ ఎగ్ ద్వారా అందుతాయి. చాలా మంది ఉదయం లేవగానే ఉడకబెట్టిన గుడ్డును తింటారు. ఇది శరీరానికి చాలా ముఖ్యం అని నమ్ముతారు. జిమ్ కు వెళ్లేవారు క్రమం తప్పకుండా ఎగ్ ను తింటారు. అంతేకాదు పచ్చి గుడ్డును కూడా తాగుతారు. అయితే పిల్లలకు మాత్రం కేవలం ఉడకబెట్టిన గుడ్డును మాత్రమే ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. ఆమ్లెట్ లాంటివి ఇవ్వకుండా ఉడకబెట్టిన గుడ్డును ఇవ్వడం ఉత్తమం.