Love: ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే కారణం చెప్పారా? మీ ప్రేమలో షరతులు ఉన్నాయా?

ఒకప్పటి ప్రేమలకు ఇప్పటి ప్రేమలకు చాలా తేడా ఉంటుంది. అసలు ప్రస్తుత ప్రేమలను ప్రేమ అనాలంటే కూడా వంద సందేహాలు వస్తుంటాయి. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఎంతో మందిని ప్రేమిస్తుంటారు.

Written By: Swathi Chilukuri, Updated On : April 8, 2024 12:52 pm

Love

Follow us on

Love: ప్రేమ.. అదొక గొప్ప కావ్యం. ఏ కవి కూడా పూర్తిగా వర్ణించలేని మధురమైన అనుభూతి ఈ పదం. ఒకరి కోసం ఒకరు బతకడం, ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం. ఎన్ని కష్టాలు ఉన్నా ప్రేమించిన వారు పక్కన ఉంటే ఇంద్రధనస్సులోని రంగులు మొత్తం మనవద్దనే ఉన్నాయా అని ఫీల్ అయ్యేలా చేస్తుంటుంది ఈ ప్రేమ. ఇంత గొప్ప ప్రేమ ఈ రోజుల్లో దొరకడం కష్టమే కదా. దొరికితే లక్కీనే.

ఒకప్పటి ప్రేమలకు ఇప్పటి ప్రేమలకు చాలా తేడా ఉంటుంది. అసలు ప్రస్తుత ప్రేమలను ప్రేమ అనాలంటే కూడా వంద సందేహాలు వస్తుంటాయి. ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఎంతో మందిని ప్రేమిస్తుంటారు. మరి ఇలాంటి ప్రేమలు ప్రేమ ఎలా అవుతుంది. అట్రాక్షన్ కు పెట్టుకున్న పేరునే కొందరు ప్రేమ అంటున్నారు. కానీ ఇప్పటికీ నిజమైన ప్రేమ బతికే ఉంది. ఒకరిని ప్రేమిస్తే మరొకరిని కన్నెత్తి చూడని వారు కూడా ఉన్నారు. మీకు ఇలాంటి వారు దొరికితే చాలా లక్కీ, ఇంతకీ ఉన్నారా?

ఏదైనా పేపర్ మీద సంతకం చేస్తుంటే కండీషన్స్ అప్లే అంటారు. అలానే ప్రేమలో కూడా షరుతులు ఉన్నాయా? మరి ఇది దేనికి సంకేతం? అయితే మీ భార్యను ఎందుకు ప్రేమిస్తున్నావ్? అని అడిగినా…ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావు అని అబ్బాయిని అడిగినా.. ఏదైనా కారణం చెబితే అది ప్రేమ కాదని తెలుసుకోండి. భార్య నాకు సేవలు చేస్తుంది కాబట్టి తనంటే ప్రేమ అని భర్త చెబితే నమ్మకండి అది కేవలం ఇష్టం మాత్రమే.సేవలు చేయకపోతే ప్రేమ లేనట్టేనా? అందుకే కారణంతో పుట్టే ప్రేమ.. ప్రేమ కాదంటారు నిపుణులు.
అబ్బాయిల విషయంలో మాత్రమే కాదు, అమ్మాయిల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. షరతులు లేకుండా ఉండే బంధంలోనే ప్రేమ ఉంటుందని.. షరతులు ఉంటే అది ప్రేమ కాదు ఇష్టం అనుకోవాలట. అయితే ఎలాంటి షరతులు లేకుండా గోపికలు శ్రీ కృష్ణుడిని ప్రేమించారు. ఇలాంటి వాటిని మాత్రమే ప్రేమ అనుకోవాలి అంటారు లవ్ గురులు. భార్యభర్తల బంధం లో అయినా ఇతర ఏ బంధంలో అయినా కారణం లేని ప్రేమ మాత్రమే ప్రేమ అని.. కారణం తో కూడుకున్న ప్రేమ.. ప్రేమ కాదంటారు. అయితే ఒకసారి మీ పార్టనర్ ను కూడా అడిగి చూడండి. కానీ కారణం చెప్పారు అని లైట్ తీసుకోకండి. కొన్ని కండిషన్ లలో ఎలా అయినా ప్రేమను చూపించవచ్చు.

గమనిక.. ఇంటర్నెట్, సోషల్ మీడియా సమాచారం మేరకు మాత్రమే ఈ విషయాన్ని మీకు చేర్చడం జరిగింది. అవగాహన కోసమే మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్. అందువల్ల ఒకే తెలుగు ఎలాంటి విషయాన్ని నిర్ధారించదు.