Free Medicine: ఈ ప్రపంచంలో ఫ్రీగా ఏదైనా లభిస్తుందంటే.. అది కేవలం మన చిరునవ్వు మాత్రమే. మన ముఖంపై చిరునవ్వు ఉండాలంటే ఎలాంటి ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. అన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందాలంటే బెస్ట్ మెడిసిన్‌లో చిరునవ్వు ఒకటి. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే మన ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. ఈ చిరునవ్వే మీ మెంటల్ హెల్త్‌ను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ చాలా మంది ఈ రోజుల్లో వ్యక్తిగత సమస్యల వల్ల అసలు ఫ్రీగా దొరికే చిరునవ్వును మరిచిపోతున్నారు. మనం ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే రోజుకి కొంత సమయమైన నవ్వాలి. మన ముఖంపై ఎంత చిరునవ్వు ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన అన్ని తొలగిపోతాయి. అలాగే బాడీకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మనం నవ్వినప్పుడు మన శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదల అవుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే మానసికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల చాలా మంది యువత మానసిక, శారీరక సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. వీటి నుంచి విముక్తి చెందాలంటే మొదటిగా చేయాల్సిన పని నవ్వడం. రోజంతా నవ్వకపోతే మీలో మీకు తెలియకుండా ఒత్తిడి మొదలవుతుంది. అవసరమైతే నవ్వడానికి కొంత సమయం పెట్టుకోండి. కామెడీ సినిమా, సరదాగా స్నేహితులతో జోక్స్ వేసుకోండి. ఎప్పుడు మీకు మీరే కాకుండా ఒంటరిగా కూర్చోని బాధపడటం కంటే మీకు ఇష్టమైన వారితో సరదాగా గడపండి. రోజులో కనీసం ఒక 15 నిమిషాలు అయిన నవ్వితే మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడంతో పాటు కండరాలు కూడా బలంగా అవుతాయి. నవ్వితే ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఎవరైనా అందంగా రెడీ అయిన కూడా ముఖంపై చిరునవ్వు లేకపోతే ఆ అందమే కనిపించదు. అదే చిన్న చిరునవ్వు ముఖంపై ఉంటే మీ అందం రెట్టింపు అవుతుంది. మీరు ఎంత సంతోషంగా ఉన్నారనేది మీ చిరునవ్వే చెబుతుంది. మనం నవ్వనప్పుడు బాడీలో ఉండే ఎండార్ఫిన్‌లు విడుదల అవుతాయి. వీటివల్ల శారీరకంగా, మానసికంగా కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. గుండె పోటు వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి. నవ్వడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా బంధాలు బలపడతాయి. ఇతరులతో నవ్వుతూ మాట్లాడటం వల్ల వారితో మీ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఏదో చిరాకుగా మాట్లాడితే గొడవలు వస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ జీవితాన్ని గడపండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.