Eyesight: ఇది తింటే.. మీ కంటిచూపు ఎంతలా పెరుగుతుందో తెలుసా.. వారం రోజుల్లో కళ్లజోడు విసిరేస్తారు!

Eyesight: ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ కంటి సమస్యలు వేధిస్తున్నాయి. నేత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే, కంటి చూపు మెరుగుపడటానికి కంటికి సంబందించిన సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే ఆయుర్వేద చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఎర్ర కందిపప్పుతో ఇలా చేయండి.. రెండు స్పూన్ల ఎర్ర […]

Written By: Raj Shekar, Updated On : March 15, 2023 5:33 pm
Follow us on

Eyesight: ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ కంటి సమస్యలు వేధిస్తున్నాయి. నేత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే, కంటి చూపు మెరుగుపడటానికి కంటికి సంబందించిన సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే ఆయుర్వేద చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

ఎర్ర కందిపప్పుతో ఇలా చేయండి..
రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత డ్రై రోస్ట్‌ చేసి ఉడికించాలి. ఉడికిన ఎర్రకందిపప్పులో నాలుగు మిరియాలను, ఉప్పు వేసి మెత్తని పేస్ట్‌గా చేసి దానిలో ఒక స్పూన్‌ అవునెయ్యి వేసి బాగా కలిపి తినాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు తీసుకుంటే కంటికి సంబందించిన సమస్యలు తగ్గటమే కాకుండా కంటి శుక్లం, కండరాల క్షీణత తగ్గుతాయి.

ఎర్రకందిపప్పులో ఈ గుణాలు..
ఎర్రకందిపప్పులో విటమిన్‌ ఏ, సీ, ఈ విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇంటి కంటి చూపు మెరుగుదలకు, కంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇది కూడా కంటికి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మిరియాలలో యాంటీ ఇన్‌ ఫ్లెమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కంటి వాపును తగ్గించటంలో సహాయపడుతాయి.

మొత్తంగా వారానికి రెండుసార్లు దీనిని తీసుకోవడం ద్వారా కంటి సమస్యలు ఉన్నవారికి తగ్గిపోతాయి. లేనివారు తీసుకున్నా వచ్చే అవకాశం ఉండదు. కళ్లజోడు వాడుతున్నవారు అంద్దాలు తీసేస్తారు. మన ఇంట్లో, మనకు అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో చేసిన పదార్థం అంతలా పనిచేస్తుంది మరి!