https://oktelugu.com/

Devotional Tips: సోమవారం ఇలా చేస్తే కష్టాలు పోయి ధనవంతులు అవుతారట.. అవేంటంటే?

Devotional Tips: మనలో చాలామందిని అప్పుల బాధలు వేధిస్తుంటాయి. కొంతమంది సులభంగానే అప్పుల బాధలను తొలగించుకుంటే మరి కొందరిని మాత్రం ఎంత శ్రమించినా అప్పుల బాధలు వేధిస్తుంటాయి. అయితే సోమవారం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా అప్పుల బాధలను తొలగించుకోవచ్చు. సోమవారం రోజున పార్వతీపరమేశ్వరులను పూజించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. తెల్లవారుజామున పార్వతీపరమేశ్వరులను పూజించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. శివుడికి వెలగపండు ఇష్టమైన పండు కాగా వెలగపండుతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 23, 2022 / 10:09 AM IST
    Follow us on

    Devotional Tips: మనలో చాలామందిని అప్పుల బాధలు వేధిస్తుంటాయి. కొంతమంది సులభంగానే అప్పుల బాధలను తొలగించుకుంటే మరి కొందరిని మాత్రం ఎంత శ్రమించినా అప్పుల బాధలు వేధిస్తుంటాయి. అయితే సోమవారం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా అప్పుల బాధలను తొలగించుకోవచ్చు. సోమవారం రోజున పార్వతీపరమేశ్వరులను పూజించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.

    Devotional Tips

    తెల్లవారుజామున పార్వతీపరమేశ్వరులను పూజించడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. శివుడికి వెలగపండు ఇష్టమైన పండు కాగా వెలగపండుతో శివుడిని పూజించడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి. వెలగపండును దేవుడికి పెట్టి పూజించడం ద్వారా పూజించిన వాళ్లు దీర్ఘాయుష్షును పొందే ఛాన్స్ అయితే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

    Also Read: Software engineer  : వర్క్ ఫ్రం హోం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు తీసింది!

    శివుడి మూడు కనులకు బిల్వ పత్రం చిహ్నం అనే సంగతి తెలిసిందే. శివుడికి సోమవారం బిల్వ పత్రంతో పూజ చేయడం వల్ల అప్పులతో పాటు దారిద్ర బాధలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. శివునికి దద్దోజనంను నైవేద్యంగా సమర్పించడం వల్ల ధనవంతులు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. ఏకాగ్రతతో దేవునికి పూజ చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

    ఏకాగ్రతతో పూజా చేయకపోతే మాత్రం మంచి ఫలితాలు దక్కే ఛాన్స్ అయితే ఉండదు. శివపార్వతులకు గంధం పూసి దీపారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. తలస్నానం చేసి పూజలు చేయడం మంచిది. శివునికి విభూదిని పెట్టి పూజ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ధనవంతులు కావాలని భావించే వాళ్లు ఈ విధంగా పూజలు చేస్తే మంచిది. దేవుడిని పూజించడం ద్వారా దేవుని అనుగ్రహం మనపై తప్పనిసరిగా ఉంటుంది.

    Also Read: Sudigaali Sudheer: పూర్ణకు ముద్దు పెట్టబోయిన సుధీర్.. ఫీల్ అయిన రష్మీ.. రోజా వార్నింగ్..