https://oktelugu.com/

Health: రాత్రి స్వీట్లు, ఐస్ క్రీమ్స్ తినాలి అనిపిస్తుందా? దీనికి కారణం, వచ్చే వ్యాధులు తెలుసా?

లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఫలితాలు వచ్చాయట. ఒంటరిగా ఉన్న కొందరి మీద పరిశోధన చేయడం వల్ల ఈ విషయం వెల్లడైందట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 24, 2024 / 02:36 PM IST

    Health

    Follow us on

    Health: స్వీట్లు, ఐస్ క్రీమ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఐస్ క్రీమ్స్ ను చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రకరకాల సమయాల్లో తినడం ఇష్టం ఉంటుంది. ఇక కొందరికి రాత్రి తినడం కూడా ఇష్టమే. అంతేకాదు వర్షంలో కూడా ఐస్ క్రీమ్స్ ను తినేవారు ఉంటారు. అయితే స్వీట్లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ను రాత్రి సమయాల్లో తినవచ్చా? లేదా? తింటే ఏమౌతుంది? ఇంతకీ ఈ సమయంలో ఎందుకు తినాలి అనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం.

    చాలా మంది ఒంటిరిగా ఉంటారు. ఇక కొందరు ఎంత మంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతారు. ఇంట్లో పది మంది ఉన్నా కూడా వారి మధ్యలో సఖ్యత లేకపోతే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటారు. ఇలాంటి సమయాల్లో ఒంటరి ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఇదిగో ఈ ఒంటరి తనం వల్లనే రాత్రిల్లు స్వీట్లు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తినాలి అనిపిస్తుంది అంటారు నిపుణులు.

    లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఫలితాలు వచ్చాయట. ఒంటరిగా ఉన్న కొందరి మీద పరిశోధన చేయడం వల్ల ఈ విషయం వెల్లడైందట. అంతేకాదు ఒంటరిగా ఉండేవారిలో స్థూలకాయం, నిరాశ, ఆందోళనలు కూడా పెరుగుతున్నాయట. ఇవి పెరగడానికి స్వీట్ క్రేవింగ్స్ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.

    స్వీట్లు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినడం వల్ల స్థూలకాయం వంటి సమస్యలు పెరుగుతుంటాయి. అంతేకాదు మానసిక, శారీరక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. మరి కాస్త ఆలోచించండి. రాత్రి సమయంలో స్వీట్లు, ఐస్ క్రీమ్స్ వంటి పదార్థాలు తినాలి అనిపిస్తే కాస్త కంట్రోల్ చేసుకోవడమే ఉత్తమం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉందని గుర్తు పెట్టుకోండి.