Relationship: మీ భర్త మరో స్త్రీ పట్ల ఆకర్షితుడు అయ్యాడా? కారణాలు ఏంటంటే..

పరస్పర నిబద్ధత, లైంగిక జీవితం అనేవి వివాహంలో చాలా ముఖ్యమైనవి. లేకపోతే మీ బంధం బలహీనపడుతుంది. చాలా వివాహాలు విఫలం కావడానికి ముఖ్య కారణం విశ్వాసం కూడా కావచ్చు.

Written By: Swathi, Updated On : April 24, 2024 2:31 pm

Relationship

Follow us on

Relationship: ఆడ మగ తేడా లేకుండా మరొకరి పట్ల ఆకర్షణ అవుతుంటారు చాలా మంది. కానీ ఈ ఆకర్షణ హద్దులు దాటితే సమస్య అవుతుందని అంటారు చాణక్యుడు. ఇదే కంటిన్యూ అయితే వైవాహిక జీవితం అతలాకుతలం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఇతరుల పట్ల మగవారు ఎందుకు ఆకర్షితులు అవుతారో ఓ సారి చూసేద్దాం.

బాల్య వివాహం.. చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల ఇతరుల పట్ల సులభంగా ఆకర్షితులు అవుతుంటారు. అర్థం కాని వయసులో వివాహం చేయడం వల్ల తమ ఇష్టాఇష్టాలను తెలుసుకొని భార్య మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటాడు భర్త. ఈ విషయంలో చాలా మంది భార్యల కంటే చురుగ్గా ఉన్న మహిళలు, అందంగా ఉన్న మహిళల పట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

శారీరక సంతృప్తి.. శారీరక సంతృప్తి లేకపోతే వివాహేతర సంబంధాలకు దారి తీసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు చాణక్యుడు. భార్యాభర్తల మధ్య ఉన్న ఆకర్షణ లోపమే వివాహేతర సంబంధాలకు మరింత కారణం అవుతుందట.

విశ్వాసం.. పరస్పర నిబద్ధత, లైంగిక జీవితం అనేవి వివాహంలో చాలా ముఖ్యమైనవి. లేకపోతే మీ బంధం బలహీనపడుతుంది. చాలా వివాహాలు విఫలం కావడానికి ముఖ్య కారణం విశ్వాసం కూడా కావచ్చు.

తప్పుగా ఊహిస్తే.. మీ జీవిత భాగస్వామిని అందంగా భావించి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అసహనంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి అందం, ప్రేమను తక్కువ అంచనా వేస్తే వివాహ బంధంలో సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. నిరాశ ఇతరులను వెతుక్కునే అవకాశాన్ని కల్పిస్తుంది.

మరి తెలుసుకున్నారు కదా వివాహ సంబంధానికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇకనైనా మీ జీవితాన్ని పదిలం చేసుకోవడానికి చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ఆనందంగా ఉంచుకోండి. లేదంటే మీ వివాహ బంధం విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్త. అండ్ ఆల్ ది బెస్ట్.