Exercize : వ్యాయామం ఆరోగ్యానికి మేలు. ప్రతిరోజూ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల యాక్టివ్ గా ఉంటారు. నేటి కాలంలో బిజీ వాతావరణంలో గడుపుతున్న వారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ ఉదయం గంట సేపు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే కొందరు ఆరోగ్యంగా ఉండాని పరిమితికి మించి వర్కౌట్లు చేస్తున్నారు. దీంతో ఆరోగ్యం మాట దెవుడెరుగు ప్రాణాలకు ముప్పు వస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్ల తరువాత కొన్ని రకాల వ్యాయామాలు అస్సలు చేయకూడదట. ఇవి చేయడం వల్ల లాభం కంటే నష్టమేఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం..
ప్రతీ వ్యక్తికి 40 ఏళ్ల వరకు ఒక జీవితం ఆ తరువాత మరో జీవితం అన్నట్లుగా ఉంటుంది. 40 ఏళ్ల తరువాత శరీరంలోని కొన్ని కణాలు క్షీణిస్తాయి. దీంతో వ్యాయామం చేసినా బాడీ సహకరించదు. అందువల్ల కొన్ని రకాల వ్యాయామాలకు దూరంగా ఉండాలి. లేకుంటే గుండెపై తీవ్ర ఒత్తిడి పడి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొందరు వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యం కోసం కష్టపడుతుండడాన్ని చూస్తుంటాం.. అయితే ఇది ఎప్పటికైనా ప్రమాదమే అని అంటున్నారు. అలాంటి వ్యాయామాల వివరాల్లోకి వెళితే..
క్రంచెస్ వ్యాయామాలు శరీర ఆకృతిని మారుస్తాయి. అయితే ఈ వ్యాయామంలో భాగంగా ఎక్కువగా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఇవి చేయడం వల్ల అవాంచిత కొవ్వు కరుగుతుంది. కానీ 40 ఏళ్లు దాటిన వ్యక్తి వీటిని చేయడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది. అంతేకాకుండా మెడ స్ట్రెయిట్ పెయిన్ వస్తుంది.
కార్డియో వ్యాయామాలు ఆరోగ్యానికి మంచిది. ఇవి చేయడం వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. కానీ 40 ఏళ్లు దాటిన వ్యక్తిలో గుండె పనితీరులో మార్పులు ఉంటాయి. ఈ సమయంలో గుండెపై వెయిట్ పడడం వల్ల ఒత్తిడికి గురవుతుంది. ఈ వ్యాయామం కష్టంగా ఉంటుంది. అయితే పెద్దవారు ఇవి చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. అలాగే కాళ్లతో బరువులు ఎత్తడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
స్క్వాట్ వ్యాయామం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇది 40 ఏళ్లు దాటిన వారికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇది చేయడం వల్ల కండరాలు దెబ్బతింటాయి. గాయాలు ఏర్పడుతాయి. అందువల్ల వీటి జోలికి వెళ్లకుండా సాధారణ వ్యాయామం చేయడం మంచిది. ఈ వయసు వారు ఆహారంలో మార్పులు చేసుకుంటూ తక్కువ మోతాదులో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.