Alcohol: మద్యం తాగితే లివర్ తో పాటు ఆ అవయవాలు కూడా దెబ్బ తింటాయా.. వైద్యుల హెచ్చరిక!

Alcohol: మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలిసిందే. అయితే యువతలో చాలామందికి మద్యం తాగడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ అలవాటుకు దూరం కాలేకపోతున్నారు. మద్యం ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బ తింటుందని చాలామంది భావిస్తారు. అయితే మద్యం తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. మద్యం తాగడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. […]

Written By: Navya, Updated On : April 7, 2022 3:09 pm
Follow us on

Alcohol: మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలిసిందే. అయితే యువతలో చాలామందికి మద్యం తాగడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ అలవాటుకు దూరం కాలేకపోతున్నారు. మద్యం ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బ తింటుందని చాలామంది భావిస్తారు. అయితే మద్యం తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశాలు అయితే ఉంటాయి.

మద్యం తాగడం వల్ల నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే మద్యం ఎక్కువగా తాగుతారో వాళ్లకు మెదడు చురుకుగా పని చేసే అవకాశాలు తక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మద్యం తాగడం వల్ల చనిపోతున్న వాళ్ల సంఖ్య 30 లక్షలుగా ఉంది. మద్యం తాగేవాళ్లు రకరకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

మద్యం తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మద్యం సేవించే వాళ్లలో మెటబాలిజం దెబ్బ తినే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మద్యం తాగడం వల్ల స్థూలకాయం, నిద్రలేమి, అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. రా ఆల్కహాల్ తాగితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఆల్కహాల్ మితిమీరి తాగితే ప్రాణాలకు అపాయం కలుగుతుంది.

ఆల్కహాల్ వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదు. ఆల్కహాల్ ను తాగడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఈ అలవాట్లు ఉన్నవాళ్లు మద్యానికి దూరమైతే మంచిదని చెప్పవచ్చు.