పెరుగుతున్న పాలిథిన్ వినియోగంతో పర్యావరణం దెబ్బతింటోంది. పాలిథిన్ ను వినియోగించకూడదని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. సరికదా వాటి వినియోగం ఇంకా రెట్టింపవుతోంది. ఒక్కో పాలిథిన్ కవర్ భూమిలో కలిసి పోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని తెలిసినా ఎవరు కూడా దీనిపై శ్రద్ధ కనబరచడం లేదు. గతంలో ప్రభుత్వాలు వీటి వినియోగానికి అడ్డుకట్ట వేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. ఫలితంగా పాలిథిన్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. దీంతో వాతావరణ సమతుల్యం విషతుల్యంగా మారుతోందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా ఎవరు కూడా దీనిపై దృష్టి సారించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా పాలిథిన్ కవర్ వినియోగంపై కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓజోన్ పొర దెబ్బతింటోంది. భూమి నుంచి వెలువడే విషవాయువులకు తోడు విమనాల రాకపోకలతో కూడా ఓజోన్ పొర ప్రమాదంల పడిపోతున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా ఓజోన్ పొర దెబ్బ తింటున్నట్లు చెబుతున్నారు. దీనిపై కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో మన వాతావరణ ప్రభావం పెరిగిపోతోంది. భూతాపం వేడెక్కితే మరింత నష్టాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.
పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో కూడా ప్రకృతి ప్రమాదంల పడుతోంది. దేశంలో నానాటికి వాహనాల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా వాటి నుంచి వెలువడే పొగ వల్ల వాతావరణ కాలుష్యం అధికమైపోతోంది. ఫలితంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. మంచు పర్వతాలు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంతాలు మునిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే దాని ప్రభావం మనుషులపైనే పడే ప్రమాదం పొంచి ఉంది. అయినా ఎవరు కూడా లెక్కచేయడం లేదు. దీంతో పలు ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్ద నగరాలకు వరదలు రావడం కూడా వాతావరణ సమతుల్యత దెబ్బతినడం వల్లే అని తెలుస్తోంది.
భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన చెన్నై వరదలు, ఉత్తరాఖండ్ లో ముంచెత్తిన వరదలు కూడా వీటి ప్రభావం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శాస్ర్తవేత్తలు ఓ పక్క చెబుతున్నా ఎవరు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీనికి ఎక్కడో ఓ చోట చరమగీతం పాడాలి. దీనికి అందరు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైంది. వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.