https://oktelugu.com/

Tollywood: టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ సినిమా సంగతులు !

టాలీవుడ్ (Tollywood) ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. క్రేజీ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా వచ్చిన ‘మిమి’ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ ని ప్రధాన పాత్రగా రీమేక్ చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా కీర్తి సురేష్ నవంబర్ నుండి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చినట్లు, వచ్చే సమ్మర్ కి ఈ సినిమాని […]

Written By:
  • admin
  • , Updated On : September 1, 2021 / 03:27 PM IST
    Follow us on

    టాలీవుడ్ (Tollywood) ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. క్రేజీ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా వచ్చిన ‘మిమి’ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ ని ప్రధాన పాత్రగా రీమేక్ చేయబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా కీర్తి సురేష్ నవంబర్ నుండి ఈ సినిమాకి డేట్స్ ఇచ్చినట్లు, వచ్చే సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీ రిలీజ్ అవ్వడం పట్ల వెంకీ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు, తమ నిరుత్సాహాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరిచారు, అందుకే, వెంకటేష్ నటించిన మరో సినిమా ‘దృశ్యం 2’ను మాత్రం ఓటీటీ ద్వారా కాకుండా డైరెక్ట్ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    అక్కినేని నాగ చైతన్య అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చైతు నటనకు ఫిదా అయిన మరి కొంతమంది దర్శకులు చైతూకు ఆఫర్లు ఇస్తున్నారు. దాంతో బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ చైతు మాత్రం ఇంకా ఏ సినిమా అంగీకరించలేదు.

    సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ( Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ నేటి నుండి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో సముద్రఖని కూడా పాల్గొన్నాడు. మహేష్ కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నాడు. కొత్త విలనిజంతో సముద్రఖని చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడట.

    రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తోన్న ‘ఖిలాడి’ సినిమాను దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తోన్న సంగతి తెలిసిందే.