మీ ఓటు ఎటువైపు కట్టు మిషన్లకా.. కళ్యాణలక్షికా.. అరవై రూపాయాల గోడ గడియారానికా రూ.. 2016 పెన్షన్లకా అని మంత్రి హరీశ్ రావు ఓటర్లను ఉద్దేశించి అడిగారు. వీటిలో ఏది ఉపయోగమో ఆలోచించాలని ఓటర్లనకు ఆయన సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేటలో యాదవ భవన నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గెల్లు శ్రీను ఉద్యమకారుడు. 20 ఏళ్లు టీఆర్ఎస్ లో పనిచేశాడు. అలాంటి ఉద్యమకారుడైన గెల్లు శ్రీనును గెలిపించండి.. మీ అభివృద్ధి బాధ్యత తాము తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏడేండ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టని ఈటల రాజేందర్ ఇవాళ గడియారాలు, కుట్టుమిషన్లతో పాటు ఇతర వస్తువులు పంచాల్సిన అవసరం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు.