ఊబకాయం,షుగర్ తో బాధ పడుతున్నారా.. పరిష్కారం ఇదే..?

దేశంలో ఊబకాయం, మధుమేహం వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జంక్ ఫుడ్ తినేవాళ్ల సంఖ్య పెరగడం, వ్యాయామం చేసేవాళ్ల సంఖ్య తగ్గడం వల్ల ఊబకాయం, షుగర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ సజ్జలతో తయారు చేసిన ఆహారపదార్థాలను తీసుకుంటే ఊబకాయం, మధుమేహం సమస్యలు దూరమవుతాయి. సజ్జలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనత […]

Written By: Kusuma Aggunna, Updated On : November 20, 2020 10:53 pm
Follow us on


దేశంలో ఊబకాయం, మధుమేహం వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జంక్ ఫుడ్ తినేవాళ్ల సంఖ్య పెరగడం, వ్యాయామం చేసేవాళ్ల సంఖ్య తగ్గడం వల్ల ఊబకాయం, షుగర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ సజ్జలతో తయారు చేసిన ఆహారపదార్థాలను తీసుకుంటే ఊబకాయం, మధుమేహం సమస్యలు దూరమవుతాయి.

సజ్జలతో తయారు చేసిన ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను దూరం చేసుకోవచ్చు. సజ్జలు మనకు ఎంతో మేలు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూర్చడంలో సహాయపడతాయి. సజ్జలలో ప్రోటీన్లతో పాటు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో సజ్జలు సహాయపడతాయి. సజ్జలలో కేలరీలు ఉంటాయి.

రోజూ మొలకెత్తిన సజ్జలు స్థూలకాయం సమస్య తగ్గడంతో పాటు సజ్జలతో చేసిన అంబలి, సంగటి ఆరోగ్యపరమైన ప్రయోజనాలను చేకూరుస్తోంది. పిల్లలు ప్రతిరోజూ సజ్జ రొట్టెలను తీసుకుంటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సజ్జలతో చేసిన అంబలి మధుమేహం సమస్యను సైతం దూరం చేస్తుంది. సజ్జలతో తయారు చేసిన ఇడ్లీలు, దోసెలు తింటే మంచిది. రోజూ సజ్జలు తీసుకునే వాళ్లలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

పిల్లలు సజ్జలను రోజూ తీసుకుంటే ఆరోగ్యపరమైన ప్రయోజనాలను చేకూర్చుతాయి. సజ్జపిండితో బెల్లం కలిపి తీసుకుంటే రక్తంలోని కొవ్వులు తగ్గుతాయి. సజ్జలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి ఇతర ఆరోగ్య సమస్యలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. సజ్జలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు సజ్జలలో ఉండే పాస్పరస్ కణాల నిర్మాణానికి సైతం ఉపయోగపడుతుంది. ‘