Health Tips : గుడ్డు.. పనీర్.. ఏది బెటర్? శరీరానికి ఏది మంచిది? ఎందులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి?

గుడ్డు , పనీర్ లో ఏదీ బెటర్ అనే విషయానికి వస్తే రెండు శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే గుడ్డును డైట్ లాగా మార్చుకొని రోజుకో గుడ్డు తీసుకోవాలి. పనీర్ ను రకరకాల రెసిపీలు చేసుకుంటే టేస్టీగా తినొచ్చు. అయితే జీర్ణసమస్యలు ఉన్న వారు మాత్రం పనీర్ కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

Written By: Chai Muchhata, Updated On : August 28, 2024 3:57 pm

Eggs-Paneer

Follow us on

Health Tips :  మనిషి ఆరోగ్యానికి పౌష్టికాహారం కావాల్సి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాల్లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. వెజ్ కంటే నాన్ వెజ్ లో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయని కొందరి భావన. అందుకే వారు ఎక్కువగా నాన్ వెజ్ పదార్థాలనే తింటుంటారు. ఈ నేపథ్యంలో గుడ్లు, మాంసాహారం, చేపలు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం వెజ్ పదార్థాల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని శాఖాహారులు వాదిస్తుంటారు. వెజ్ కంటెంట్ అయిన కూరగాలయతో పాటు పనీర్ తింటుంటారు. ఈ నేపథ్యంలో గుడ్డు, పనీర్ లో ఎటువంటి పోషకాలు ఉంటాయి. వీటి మధ్య తేడాలు ఎలా ఉంటాయి? ఆ వివరాల్లోకి వెళితే..

రోజుకో గుడ్డు తినండి.. బలంగా ఉండండి.. అని ప్రతిరోజూ టీవీలో యాడ్ చూస్తుంటాం. ఈ యాడ్ లో చెప్పినట్లుగానే ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రొటీన్లు అందుతాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవారు ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే పనీర్ లోనూ విలువైన పోషకాలు ఉన్నాయి. పనీర్ తో కర్రీతో పాటు వివిధ రకాల పదార్థాలు చేసుకుంటూ ఉంటారు. దీనిని కర్రీతో పాటు ఇతర స్వీట్లు కూడా చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల అదనపు శక్తి లభిస్తుందని చెబుతున్నారు.

ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల అమైనో అమ్లాలు ఉంటాయి. గుడ్డులో ఎక్కవగా కాల్షియం ఉంటుంది. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉన్నప్పటికీ తొందరగా డైజేషన్ అవుతుంది. కండరాల బలోపేతానికి, శరీర వృద్ధికి గుడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గుడ్డులో తక్కువ మొత్తంలో క్యాలరీలు కలిగి ఉంటాయి. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకున్నా బరువు పెరిగే ఆస్కారం ఉండదు. గుడ్డును కొందరు శాఖాహారులు కూడా తీసుకోవచ్చు.

పనీర్ వెజ్ పదార్థం అయినప్పటికీ ఇందులో గుడ్డుతో సమానంగా పోషకాలు ఉంటాయి. పనీర్ లోనూ కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. వంద గ్రాముల పనీర్ లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గుడ్డులో కంటే ఎక్కువ. అయితే ఇది పాల పదార్థం. అందువల్ల ఇది తీసుకున్నప్పుడు జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే పనీర్ ను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇందులో క్యాలరీల శాతం అధికంగా ఉంటుంది.

గుడ్డు , పనీర్ లో ఏదీ బెటర్ అనే విషయానికి వస్తే రెండు శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే గుడ్డును డైట్ లాగా మార్చుకొని రోజుకో గుడ్డు తీసుకోవాలి. పనీర్ ను రకరకాల రెసిపీలు చేసుకుంటే టేస్టీగా తినొచ్చు. అయితే జీర్ణసమస్యలు ఉన్న వారు మాత్రం పనీర్ కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అనారోగ్యాల సయాల్లో గుడ్డుకు దూరంగా ఉండాలి. ప్రత్యేక వ్యాధులు ఉన్న వారు వైద్యుల సలహా మేరకే గుడ్డు తినేందుకు ఇష్టపడాలని కొందరు ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.