https://oktelugu.com/

Diabetes : మధుమేహం ఇబ్బంది పెడుతుందా.. అయితే నడకతో చెక్ పెట్టండిలా!

రోజూ వాకింగ్ చేయడం వల్ల మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. రోజుకి కనీసం 5 వేల అడుగులు వేస్తే తగ్గుతుంది. కొత్త వాకింగ్ చేసేవాళ్లు నెమ్మదిగా చేయాలి. మొదట్లో 2500 అడుగులతో ప్రారంభించాలి. అలా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఇలా నడవడం వల్ల దీర్ఘకాలంగా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 28, 2024 / 10:46 PM IST

    Walking

    Follow us on

    Diabetes :  ఈరోజుల్లో చాలామంది మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు. దీనిని తగ్గించుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఇది తగ్గడానికి మందులు ఎంత ముఖ్యమూ.. మన ఆహార అలవాట్లు, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. అడుగులతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది ఫుడ్‌ను కంట్రోల్ చేసుకోలేక తినేస్తుంటారు. ఏది పడితే అది తినేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. అదే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుని వ్యాయామం సరిగ్గా చేస్తే మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. మరి దీనిని తగ్గించుకోవాలాంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

    రోజూ వాకింగ్ చేయడం వల్ల మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. రోజుకి కనీసం 5 వేల అడుగులు వేస్తే తగ్గుతుంది. కొత్త వాకింగ్ చేసేవాళ్లు నెమ్మదిగా చేయాలి. మొదట్లో 2500 అడుగులతో ప్రారంభించాలి. అలా ఆ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఇలా నడవడం వల్ల దీర్ఘకాలంగా మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా నడవకపోతే రోజుకి కొంచెం కొంచెం నడవాలి. ముఖ్యంగా భోజనం తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు నడవాలి. ఇలా చేయడం వల్ల షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం ఉన్నవాళ్లు సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా నిద్రలేచని గంటలోగా ఏదో ఒకటి తినాలి. అప్పుడే సమస్య తీవ్రతను తగ్గించవచ్చు.

    ముఖ్యంగా తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్ ఉండే పదార్థాలు తీసుకోవాలి. పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. వంట గదిలో ఉండే పదార్థాలతో మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కాకరకాయ రసంతో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. రోజూ ఉదయం పూట లేదా సాయంత్రం కాకరకాయ రసాన్ని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే మెంతి గింజలతో కూడా తగ్గించుకోవచ్చు. రోజూ ఉదయం పూట నానబెట్టిన మెంతి గింజలు లేదా గింజలతో చేసిన పౌడర్‌ను తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మధుమేహం తగ్గడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.

    ఇంట్లో ఉండే దాల్చిన చెక్కతో మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడతాయి. దాల్చిన చెక్క పొడిని టీలో కూడా వేసుకుని తాగితే గ్లైసెమిక్ నియంత్రణగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో మనం నిత్యం వాడే పసుపుతో తొందరగా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ఇందులో యాంటీ ఇన్‌‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో లేదా పాలలో చిటికెడు పసుకు వేసుకుని తాగితే దీనికి చెక్ పెట్టవచ్చు. అలాగే రోజంతా ఉత్సాహంగా కూడా ఉంటారు. వీటితో పాటు వేప ఆకులు లేదా వేప పౌడర్, ఉసిరి పౌడర్‌ను నీటిలో కలిసి తాగినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.