Meat: మాంసం ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయా?

Meat: దేశంలో ప్రతి 100 మందిలో 80 మంది మాంసం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చికెన్ లేదా మటన్ తో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి కాబట్టి చికెన్, మటన్ రేట్లు పెరిగినా మాంసం తినేవాళ్లు చికెన్, మటన్ లను కొనుగోలు చేసే విషయంలో వెనుకడుగు వేయడం లేదు. అయితే మాంసాహారం ఎక్కువగా తినేవాళ్లు దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రాసెస్ చేసిన మాంసం ఆరోగ్యానికి ఏ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 10, 2022 10:51 am
Follow us on

Meat: దేశంలో ప్రతి 100 మందిలో 80 మంది మాంసం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చికెన్ లేదా మటన్ తో చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి కాబట్టి చికెన్, మటన్ రేట్లు పెరిగినా మాంసం తినేవాళ్లు చికెన్, మటన్ లను కొనుగోలు చేసే విషయంలో వెనుకడుగు వేయడం లేదు. అయితే మాంసాహారం ఎక్కువగా తినేవాళ్లు దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రాసెస్ చేసిన మాంసం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల పేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం పేగుల పనితీరుపై ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే మాంసం ఎక్కువగా తీసుకుంటారో వాళ్లు బరువు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బరువు తగ్గాలని భావించే వాళ్లు మాంసంకు దూరంగా ఉంటే మంచిది.

మాంసాహారంను ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్లకు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కొలెస్ట్రాల్ పెరిగితే మధుమేహం ముప్పు ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించే అవకాశం ఉంటుంది. మాంసం తినడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి.

మాంసం తినడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్లు లభిస్తాయి. మాంసం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మాంసం తినేవాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.