Bhanumathi-Savitri: ఉత్తమనటి అవార్డ్ విషయంలో భానుమతి, సావిత్రి మధ్య జరిగిన గొడవేంటో తెలుసా..?

వార్డుల కోసం మన హీరోలు అలాగే వాళ్ళ అభిమానులైన ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అవార్డుల విషయంలో కొన్ని సందర్భాల్లో గొడవలు రావడం సహజంగా జరుగుతూనే ఉంటుంది.

Written By: Gopi, Updated On : March 5, 2024 10:48 am

Bhanumathi and Savitri

Follow us on

Bhanumathi-Savitri: ఇండస్ట్రీలో సినిమాల మధ్య ఎంత పోటీ అయితే ఉంటుందో ఆ సినిమాలు సక్సెస్ అయిన తర్వాత అవార్డులను పంచే విషయంలో కూడా అంతకుమించిన పోటీ అనేది ఉంటుంది.ముఖ్యంగా హీరోల అభిమానులు ఆ అవార్డు వాళ్ల హీరోకి రావడాన్ని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకుంటారు. ఎందుకంటే అందరిని బీట్ చేసి మన హీరోకి అవార్డు వచ్చిందంటే మన హీరోలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉందని వాళ్ళు భావిస్తారు.

కాబట్టే అవార్డుల కోసం మన హీరోలు అలాగే వాళ్ళ అభిమానులైన ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అవార్డుల విషయంలో కొన్ని సందర్భాల్లో గొడవలు రావడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా నేషనల్ అవార్డులు ప్రకటించినప్పుడు కూడా తెలుగులో ‘అల్లు అర్జున్'(Allu Arjun) కి నేషనల్ అవార్డ్ వచ్చిందని మిగతా లాంగ్వేజేస్ లోని హీరోలు కూడా కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయమైతే మనకు తెలిసిందే… ఇక ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో చాలా అవార్డుల విషయంలో ఇలా జరుగుతూనే ఉంటుంది… 1950 లో మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ పేరు తో మద్రాస్ లో ఒక సంఘం ఉండేది.

దీని తరఫున ప్రతి ఏటా అవార్డులని ప్రధానం చేస్తూ ఉండేవారు. ఇక 1953 వ సంవత్సరంలో తెలుగులో దేవదాసు సినిమా సూపర్ హిట్ అయినందువల్ల ఉత్తమ నటుడిగా నాగేశ్వరరావుకి ఈ అవార్డ్ ను ప్రధానం చేశారు. ఇక ఉత్తమ నటిగా భానుమతిని చండీరాణి సినిమా కోసం ఎంపిక చేశారు. అలాగే తమిళంలో ఉత్తమ నటిగా దేవదాసు సినిమా కోసం సావిత్రిని ఎంపిక చేశారు. ఇలా ఇద్దరు హీరోయిన్లకు అవార్డులను అనౌన్స్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలు తెలుగు, తమిళం రెండింటిలో నిర్మాణం జరుపుకున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక సినిమాకి అవార్డ్ ఇస్తే రెండు భాషల్లో ఆ సినిమా కే అవార్డ్ ను ఇవ్వాలి కానీ, అలా కాకుండా దేవదాస్ సినిమా కోసం సావిత్రికి తమిళంలో ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటి? అలాగే చండీరాణి సినిమా కోసం తెలుగులో భానుమతి గారికి ఉత్తమ నటి అవార్డు ఇవ్వడం ఏంటి? ఇస్తే రెండు భాషలలో కలిపి ఒక సినిమాకే ఇవ్వాలి కదా…

అంటే సావిత్రి తమిళ్ దేవదాస్ లో బాగా చేసింది కానీ తెలుగు దేవదాస్ లో బాగా చేయలేదా అనే విషయం మీద అప్పట్లో ఒక పెద్ద చర్చ అయితే నడిచింది. ఇక ఇదిలా ఉంటే ఉత్తమ నటి అవార్డును అందుకోవడానికి దేవదాస్ సినిమా నుంచి సావిత్రి వచ్చి అవార్డుని అందుకుంటే, చండిరాణి సినిమా కోసం భానుమతి గారు ఆ ఈవెంట్ కి రాకపోవడం విశేషం…