Jaggery Health Benefits: చాలామంది కొన్ని పదార్థాలలో చక్కెరకు బదులు బెల్లాన్ని వాడాలని సూచిస్తున్నారు. కానీ చక్కెర కంటే బెల్లాన్ని వాడడం వల్ల ఎలాంటి రుచి ఉండాలని అనుకుంటారు. కానీ చక్కెర కంటే బెల్లం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా అదనంగా ప్రోటీన్లను ఇస్తుంది. అయితే కేవలం బెల్లం మాత్రమే తినకుండా బెల్లంతో కలిపి కొన్ని పదార్థాలను తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్లను అందించడంతోపాటు కొన్ని రోగాలు రాకుండా కాపాడుతుంది. అయితే బెల్లంతో ఎలాంటి పదార్థాలను కలిపి తినాలి? అవి తినడం వల్ల ఎలాంటి ఎనర్జీ వస్తుంది? ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి?
బెల్లంలో రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. అంతేకాకుండా రక్తంలో ఉన్న మలినాలను తొలగించి రక్తప్రసరణ మెరుగ్గా ఉండేవిధంగా చేస్తాయి. బెల్లం ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ పెంపొందుతుంది. భోజనం చేసిన తర్వాత బెల్లం కలిగిన పదార్థాలను తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. తక్షణం ఎనర్జీ కావాలంటే ఒక బెల్లం ముక్కను తినడం వల్ల సాధ్యమవుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు బెల్లాన్ని తినడం వల్ల వారిలో ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిల్లంలో ఐరన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండడంతో రక్తం సక్రమంగా సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి బెల్లం ఎంతో ఉపయోగపడుతుంది.
అయితే బెల్లం నేరుగా తినాలని ఇబ్బందికి గురైతే.. వీటికి కొన్ని పదార్థాలను కలిపి తినడం వల్ల అదనపు శక్తి వస్తుంది. బెల్లం తో పాటు శనగలు కలిపి తినడం వల్ల అదనంగా ప్రోటీన్ లభిస్తుంది. ఈ మిక్సింగ్ తినడం వల్ల బలం పెరుగుతుంది, రక్తం శుద్ధి అవుతుంది, ఇమ్యూనిటీ గ్రోత్ అవుతుంది. పల్లీలతో కలిపి బెల్లం తినడం వల్ల వర్కౌట్ చేసేవారికి ఉపయోగపడుతుంది. అలాగే నువ్వులతో కలిసి బెల్లం లడ్డు తయారు చేసుకోవచ్చు. ఈ రెండు మిశ్రమాలను కలిపి తినడం వల్ల కాల్షియం పెరుగుతుంది. ఓమేగా న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎముకల్లో బలం పెరుగుతుంది.
బెల్లం తో పాటు శనగపిండి కలిపి తినడం వల్ల జీనక్రియ సమస్యలు తొలగిపోతాయి. ఫైబర్ ఎక్కువగా లభ్యమవుతుంది. బెల్లంతో కలిపి సోయాపిండి తినడం వల్ల అత్యధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఈ మిశ్రమం తో లడ్డు చేసుకొని తినడం వల్ల చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లోను బెల్లం ఉపయోగించుకోవచ్చు. బాదం, కాజు, వాల్నట్ తో కలిపి బెల్లం తినవచ్చు.