Noodles and Pasta: ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో ఫుడ్ కంటే బయట దొరికే ఆహారం కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు సరదాగా వారికి బయట తినిపించడం వల్ల వాటి వారికి అది అలవాటుగా మారిపోతుంది. దీంతో నిత్యం బయట తిండి తినాలని మారాం చేస్తూ ఉంటారు. ఈ కాలం పిల్లలు ఎక్కువగా నూడిల్స్, పాస్తా తినాలని పట్టుబడుతున్నారు. తల్లిదండ్రుల సైతం ఈ పదార్థాలు రుచిగా ఉండటంతో వాటిని పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇవి తినడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలిస్తే మరోసారి వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు. అసలు ఈ రెండు తినడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి ఇప్పుడు చూద్దాం..
మార్కెట్లో అందుబాటులో, రుచిగా ఉండే నూడిల్స్, పాస్తా తినడం వల్ల పిల్లలకు లాభాల కంటే నష్టాలు ఎక్కువగా కలిగిస్తాయి. ఇవి పూర్తిగా మైదాపిండితో తయారు చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే టేస్టీ కోసం ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. కానీ వారంలో ఒకసారి లేదా పదేపదే తినడం వల్ల శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే?
పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం:
ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదు. అందుకు కారణం బయట దొరికే ఈ నూడిల్స్ ఇంట్లో వాటికంటే ఎక్కువగా టేస్టీగా ఉండడం. అయితే ఇవి కొంచెం తీసుకున్న కూడా కడుపు నిండినట్లు అవుతుంది. దీంతో ఆకలి తగ్గిపోతుంది. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆహారం తీసుకున్న కూడా కొద్దిగా మాత్రమే తీసుకోగలుగుతారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన శక్తి తగ్గిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పిల్లలు నూడిల్స్ మాత్రమే కావాలని అడుగుతూ ఉంటారు. కొందరైతే ఇవి లేకుండా అసలు ఎలాంటి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. అందువల్ల నూడిల్స్ తినే అలవాటుకు దూరంగా ఉంచాలి.
మసాలా ఎక్కువ:
వీటిలో మసాలా ఎక్కువగా ఉండడంతో పిల్లల కడుపులో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దీంతో హైపర్ ఆక్టివిటీ పెరిగిపోతుంది. కోపం ఎక్కువగా ఉండి నిద్ర తగ్గిపోతుంది. అందువల్ల ఈ రెండు ఆహార పదార్థాలను దాదాపు ఇవ్వకుండా ఉండడమే మంచిది.
పోషకాలు లేని ఆహారం:
నూడిల్స్, పాస్తా వంటి ఆహారంలో ఎలాంటి పోషకాలు లేవని చాలామంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్ ఉండదు, ఇనుము, విటమిన్లు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాకుండా ఇవి తినడం వల్ల ఎక్కువగా కొవ్వు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో శరీరంలో శక్తి తగ్గడంతో పాటు.. తరచూ అలసటగా ఉండిపోతుంది. క్రమంగా రక్తహీనత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
మెదడు అభివృద్ధి:
ఈ రెండు పదార్థాలు తినడం వల్ల పిల్లల ఎక్కువగా మెదడు అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నూడిల్స్, పాస్తాలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఐరన్ వంటివి ఉండవు. ఎక్కువ కాలంలో వీటిని తీసుకోవడం వల్ల చదివే శక్తి తగ్గిపోతుంది. ఒకే విషయంపై దృష్టి కేంద్రీకరించలేక పోతారు. ప్రతిదానికి చికాకు పెరుగుతుంది. అందువల్ల వీటికి దూరంగా ఉండటమే మంచిది.