Breakfast: ఆరోగ్యాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఎంత జాగ్రత్త వహించాలి. జాగ్రత్త పడితేనే ఆరోగ్యం లేదంటే అనారోగ్యమే. దీనికోసం ఉదయం అల్పాహారంలో ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకోవాలి. కొన్ని పదార్థాలు ఉదయం తీసుకుంటే.. ఉబకాయం వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. మరి ఎలాంటి పదార్థాలు తీసుకోవద్దో చూసేయండి.
ప్యాక్డ్ జూస్: ప్యాక్డ్ జూస్ లకు ఉదయం దూరంగా ఉండాలి. ఉదయమే వీటిని తీసుకోవడం వల్ల ఉబకాయం వస్తుంది. అంతేకాదు షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి.. జాగ్రత్త.
టీ, కాఫీ: టీ, కాఫీలకు దూరంగా ఉండడమే మంచిది. ఉదయం వీటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గుండెలో మంట, జీర్ణ వ్యవస్థకు ముప్పు ఉంటుంది.
అరటి పండ్లు: అరటి పండ్లను కూడా ఉదయం తీసుకోవద్దు అంటారు. దీని వల్ల రక్తంలోని రెండు కణజాల అసమతుల్యత ఏర్పడుతుందట. ఇది ప్రమాదం అంటున్నారు నిపుణులు.
పెరుగు: ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయట. దీని వల్ల జలుబు, అసిడిటీ సమస్యలు వెంటనే వస్తాయట.
తియ్యటి ఆహారాలు.. ఉదయం పూట తియ్యటి ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా మంచిది కాదు. దీని వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. అలాగే బ్రెడ్ జామ్ ను కూడా ఉదయం తీసుకోకపోవడమే మంచిది. ఇందులో చక్కెర కొవ్వు ఉంటుంది.
తెలుసుకున్నారు కదా.. ఉదయం ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలో.. మరి ఈ విషయాలను గుర్తు పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కొన్ని పదార్థాలను మద్యాహ్నం సేవించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కొన్ని పదార్థాలను సేవించకూడదు అంటారు. అలాంటి పదార్థాలను తెసుకొని పాటించడమే బెటర్. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇక టీ, కాఫీలను మానేయండి అని కొందరు అంటే సింగిల్ టీ బెటర్ అని కొందరు అంటారు. సో జాగ్రత్త.