5 Vegetables : ఈ ఐదు కూరగాయలు తింటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి

మధుమేహం ఈ రోజుల్లో సాధారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి షుగర్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. దీంతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : June 25, 2023 4:46 pm
Follow us on

5 Vegetables : మధుమేహం ఈ రోజుల్లో సాధారణమైంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి షుగర్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. దీంతో డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మన ఆహార అలవాట్లు మనకు నష్టాలు తెస్తున్నాయి. కానీ మనం మాత్రం జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుని మన డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

బ్రోకలీ

కూరగాయల్లో మంచి ఫైబర్ ఉన్న ఆహారంగా దీన్ని పేర్కొనవచ్చు. బ్రోకలీ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పోషకాలు ఉండే కూరగాయల్లో ఫైబర్ ఉండే వాటిలో ఇది ఒకటి. ఇందులో విటమిన్ ఎ,సి,ఇ,కె మరియు బి12 పుష్కలంగా ఉంటాయి. దీంతో రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఇది ఎంతో సాయపడుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

బీన్స్

బీన్స్ లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. చక్కెర ఉన్న వారికి ఇది మంచి ఆహారం. ఫైబర్ అధికంగా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు ఉండటంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిక్కుళ్లలో కూడా ఇనుము, కాల్షియం వంటివి ఉండటం వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇలా బీన్స్ మనకు చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి.

క్యారెట్

క్యారెట్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. కూరగాయల్లో క్యారెట్ మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్ట శుభ్రమవుతుంది. క్యారెట్ తినడం వల్ల కంటి సంబంధమైన సమస్యలు రాకుండా చేస్తుంది. ఇలా క్యారెట్ మన ఆరోగ్యాన్ని కలిగించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది.

కాకరకాయ

డయాబెటిస్ కు కాకరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. కాకరకాయను పులుసుగా చేసుకోవచ్చు. ప్రై చేసుకుని తినొచ్చు. ఇంకా పచ్చడిగా చేసుకోవచ్చు. దీంతో కాకరకాయ రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సాయపడుతుంది. శరీరంలో కఫం రాకుండా చేస్తుంది. ఇలా దీంతో మనకు చాలా లాభాలున్నాయి.

క్యాబేజీ

క్యాబేజీ కూడా ఫైబర్ ఉన్న ఆహారమే. షుగర్ వ్యాధి గ్రస్తులకు దీన్ని తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. అధిక ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. దీన్ని తినడం వల్ల పొట్ట శుభ్రంగా చేయడంలో తోడ్పడుతుంది. ఇలా ఫైబర్ ఉన్న ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.