Health Tips : మధుమేహం ఉన్నవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రతరం అయ్యి మరణం సంభవించవచ్చు. మధుమేహం ఉన్నవారు చక్కెర, కార్బోహైడ్రేట్లు ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఏ పదార్థం తిన్నా ఆలోచించి తినాలి. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీరు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మాత్రం మొలకెత్తిన గింజలను ఎక్కువగా డైట్‌లో చేర్చుకోవాలి. కొందరు పెసలు, మినుమలు, శనగలతో మొలకెత్తిన గింజలు చేస్తుంటారు. ఇవి మధుమేహుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటి కంటే మొంతులను మొలకలుగా చేసి తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అసలు మొలకెత్తిన మొంతులను తయారు చేసుకోవడం ఎలా? వీటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
మొలకెత్తిన మెంతులను సాధారణ వాటిలానే క్లాత్‌లో కట్టి తయారు చేసుకోవాలి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, బి-కాంప్లెక్స్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. మొలకెత్తిన మెంతులు తీసుకోవడం ఆరోగ్యానికి ఒక వరం. రోజూ వారీ డైట్‌లో వీటిని చేర్చుకోవడం వల్ల మధుమేహంతో పాటు దీర్ఘకాలిక సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్న వారు వీటిని తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరం. మొలకెత్తిన మెంతులను తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ తప్పకుండా వీటిని డైట్‌లో ఏదో విధంగా యాడ్ చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా పరార్ అవుతాయి.
కొందరు బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి వారు మొలకెత్తిన మెంతులను తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారట. ఇందులోని ఫైబర్ మలబద్ధకం సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మొలకెత్తిన మెంతుల్లోని ఫైబర్ కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఉదయం పూట తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పుష్కలంగా పెరుగుతుంది. అయితే వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన మోతాదుల కంటే ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తక్కువ మోతాదులో డైలీ తినడానికి ప్లాన్ చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.