కాలం మారే కొద్దీ రక్తపోటు, షుగర్ తో బాధపడే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఆరోగ్య సమస్యల వల్ల చాలామందిని ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. వంటింటి పోపుల పెట్టెలో ఉండే దినుసులలో ఒకటైన దాల్చిన చెక్క గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అగ్రికల్చరల్ రీసెర్చ్ మ్యాగజైన్‌లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలను శాస్త్రవేత్తలు ప్రచురించారు. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో పాటు యాంటీబయోటిక్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను దాల్చిన చెక్క కలిగి ఉంది. దాల్చిన చెక్క వల్ల సులభంగా జీర్ణక్రియ మెరుగుపడే ఛాన్స్ కూడా ఉంటుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.
దాల్చిన చెక్కను డైరెక్ట్ గా ఉపయోగించకుండా టీలా తయారు చేసుకొని తాగితే మంచిది. ఆహారంలో దాల్చిన చెక్కను చేర్చుకోవడం ద్వారా టైప్-2 డయాబెటిస్‌ను సులభంగా నియంత్రించవచ్చు. దాల్చిన చెక్క ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.