Warm Water: ఆరోగ్యం గురించి చాలా మందికి అవగాహన పెరిగింది. ఒకప్పుడు నాటు వైద్యం చేసేవారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ వైద్యాలు చేసుకుంటున్నారు. తమ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహిస్తూ ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటున్నారు. రకరకాల టిప్స్ ఫాలో అవుతూ.. అందం, ఆరోగ్యం పెంచుకునే పనిలో పడ్డారు. అయితే ఉబకాయం రాకుండా ఉండడానికి కొన్ని పద్దతులు ఫాలో అవుతుంటారు. అందులో ముఖ్యంగా ఉదయం లేవగానే గోరు వెచ్చని నీరు తాగుతుంటారు. మరి ఉదయం ఈ విధంగా గోరు వెచ్చని నీరు తాగడం మంచిదా? కాదా అనే విషయం మీకు తెలుసా? అయితే ఓ సారి తెలుసుకుందాం..
*గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మంచి జరగుతుందనేది నిజం.. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతోంది. అంతేకాదు పేగుల్లో కదలికలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల మలబద్దకం సమస్య రాకుండా సహాయపడుతాయి ఈ వేడి నీళ్లు.
*ఉదయాన్నే పరిగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వల్ల బరువు పెరగకుండా ఉంటుంది. ఇది అధ్యయనాలు చేసి మరీ చెప్పారు. ఇక కడుపు నిండిన అనుభూతి ఉంటుంది కాబట్టి ఆహారం త్వరగా జీర్ణమై కొవ్వు పెరుకునే సమస్య ఉండదు.
* చలికాలంలో ముక్కు దిబ్బడ ఎక్కువగా వస్తుంటుంది. ఈ సమస్య నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగితే శ్వాస తీసుకోవడం తేలిక అవుతుంది. అంతేకాదు కండరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది.
* మంచితో పాటు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండోయ్.. మోతాదుకు మించి వేడి నీటిని తీసుకుంటే శరీరం పై చెడు ప్రభావం కూడా ఉంటుందట.
* ఎక్కువ వేడి నీళ్లను తీసుకుంటే శరీరంలో నీటి సాంధ్రతలో అసమతుల్యత ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీంతో డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు.
* గోరువెచ్చని నీటిని అధికంగా తీసుకుంటే నిద్రలేమికి కారణం కూడా అవుతుంది. ఇది స్లీప్ క్లాక్ పై ప్రభావం చూపుతుంది.
* వేడి నీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్ర పిండాలపై కూడా ప్రభావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. వేడి నీటిని తీసుకోవడం వల్ల మూత్ర పిండాల పని తీరు దెబ్బతింటుందని టాక్.