Pomegranate Juice Benefits: దానిమ్మ జ్యూస్ తాగితే ఈ రోగాలకు దూరం కావచ్చు

రక్తస్రావం హిమోరాయిడ్స్ తో బాధపడుతున్న వ్యక్తులకు దానిమ్మ రసంతో పంచదారను కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఇంకా ఎండిన పండ్ల తొక్కతో తయారు చేసిన 10 గ్రాముల పొడిని సమాన మొత్తంలో చక్కెరతో రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

Written By: Srinivas, Updated On : June 7, 2023 5:56 pm

Pomegranate Juice Benefits

Follow us on

Pomegranate Juice Benefits: దానిమ్మలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. మన ఆరోగ్య పరిరక్షణలో ఇది సాయపడుతుంది. దానిమ్మలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్ణం సమస్యకు ఇది చెక్ పెడుతుంది. దానిమ్మలో ఒక గ్రాము నల్ల ఉప్పు లేదా కాల్చిన దాల్చిన చెక్క పొడిని తేనె లేదా పంచదారతో కలిసి తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మింగడానికి ముందు కొద్దిసేపు నోటిలో ఉంచుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

రక్తస్రావం హిమోరాయిడ్స్ తో బాధపడుతున్న వ్యక్తులకు దానిమ్మ రసంతో పంచదారను కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. ఇంకా ఎండిన పండ్ల తొక్కతో తయారు చేసిన 10 గ్రాముల పొడిని సమాన మొత్తంలో చక్కెరతో రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

దానిమ్మ తొక్క అతిసారానికి మందులా ఉపయోగపడుతుంది. 10 గ్రాముల దానిమ్మ తొక్క కషాయం రోజుకు మూడు సార్లు తాగితే అతిసారం, విరేచనాల నుంచి బయటపడొచ్చు. దానిమ్మ పండు పుష్కలంగా తినడం వల్ల మనం రోగాల నుంచి ఉపశమనం పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దానిమ్మతో మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

దానిమ్మ తొక్కతో తయారు చేసిన వెచ్చని కషాయంతో పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసన పోతుంది. తాజా శ్వాస కోసం రోజుకు 3-4 సార్లు ఈ కషాయం తాగితే నోరు శుభ్రంగా అవుతుంది. దానిమ్మ గింజలను పేస్టుగా చేసుకుని రోజుకు రెండుసార్లు మొటిమలపై పూయడం ద్వారా అవి కనబడకుండా పోతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉండటం వల్ల రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం మంచిది.