Dragon fruit : ఆరోగ్యంగా ఉండాలని చాలామంది ఈ రోజుల్లో పండ్లు ఎక్కువగా తింటారు. పండ్లు తినడం వల్ల ఆరోగ్యం కుదుట పడటంతో పాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఇవి కాస్త రేటు అయిన డబ్బులు ఖర్చు పెట్టి మరి కొంటుంటారు. ఎక్కువగా డైట్ ఫాలో అయ్యే వాళ్లు పండ్లను తీసుకుంటారు. సలాడ్స్ లేదా ఓట్స్‌తో తింటుంటారు. మరీ ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లను అయితే తప్పకుండా తింటారు. అయితే ఈ పండ్లలో డ్రాగన్ ఫూట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది వీటిని సాగు చేస్తున్నారు. సీజనల్‌గా దొరికే ఈ ఫ్రూట్ చాలా రేటు ఉంటుంది. అయిన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలామంది వీటిని కొని తింటుంటారు. ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒక దాంట్లో లోపల రెడ్ కలర్, వైట్ కలర్‌లో ఉంటాయి. రెండింటిలో ఏది తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. మరి రోజూ వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చుద్దాం.
డ్రాగన్ ఫ్రూట్‌ను రోజు ఒక చిన్న ముక్క తిన్న చాలు. ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల మధుమేహ కంట్రోల్ అవుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే పెద్ద పేగు క్యాన్సర్ నివారించడంలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ బాగా సాయపడుతుంది. ఈ ఫ్రూట్‌లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులను కూడా తగ్గించడంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పీచు, ఫైబర్ వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది. దీనిని రోజూ చిన్న ముక్క అయిన తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
ఈ పండును తినడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో అధికంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిని రోజూ తింటే గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఈ పండును తినడం ఇష్టం లేకపోతే జ్యూస్ చేసి కూడా తీసుకోవచ్చు. దీనివల్ల స్కిన్ గ్లోగా తయారవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో డ్రాగన్ ఫ్రూట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కీళ్లు నొప్పులతో బాధపడేవాళ్లు దీనిని రోజూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లో ఉన్న కూడా ఈ పండు సహాయపడుతుంది.