Saripodhaa Sanivaaram Review : ‘సరిపోదా శనివారం’ ఫుల్ మూవీ రివ్యూ…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాని ఈ సినిమాతో మరోసారి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన క్యారెక్టర్ లను మినహాయిస్తే ఈ క్యారెక్టర్ లో మాత్రమే తను పూర్తి ఎఫర్ట్ పెట్టినట్టుగా అర్థమవుతుంది.

Written By: NARESH, Updated On : August 29, 2024 8:15 am

Saripodhaa Sanivaaram Review

Follow us on

Saripodhaa Sanivaaram Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిద్యమైన కథాంశాలను ఎంచుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న హీరోల్లో నాని ఒకరు… ఇప్పటివరకు ఆయన చేసిన చాలా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఆయన హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా లేదా నాని ఈ సినిమాతో నాని మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్ జే సూర్య చాలామంది బెదిరితిస్తు అక్రమాలు చేస్తూ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. ఇక ఇదే సమయంలో వారం మొత్తం ఎవరెవరు ఏ తప్పులు చేశారో రాసుకుంటూ శనివారం మాత్రమే అందరికీ తగిన గుణపాఠం చెప్పడానికి పూనుకుంటాడు. నాని ఎస్ జె సూర్యకి మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యలో హీరోయిన్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే నాని ఈ సినిమాలో వన్ మ్యాన్ షో చేశాడు. నిజానికి నాని లాంటి గొప్ప నటుడు తన స్క్రీన్ స్పేస్ ఎంత అయితే ఉందో తెలుసుకొని ఆ ఆధ్వర్యంలో ప్రేక్షకులను మెప్పిస్తూ ఆ పాత్రలో నటిస్తూ ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఒక పెద్ద భారం అయితే మోస్తూ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎంచుకున్న ప్లాట్ పాయింట్ కొత్తది ఏమీ కానప్పటికీ హీరో యొక్క స్టామినాని తెలియజేసే విధంగా సీన్స్ అయితే రాసుకున్నారు. అలాగే కథని ఏ ఉద్దేశ్యంతో అయితే రాసుకున్నారో దాన్ని ఎక్కడ డివియేట్ అవ్వకుండా దర్శకుడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక వీళ్ళ కాంబో లో ఇంతకుముందు అంటే సుందరానికి అనే సినిమా వచ్చినప్పటికీ ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.ఇక దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే ఒకే ఒక సంకల్పం తో ఇద్దరు కలిసి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని ముందుకు సాగారు.

ఇక దాంతో పాటుగా హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా రాసుకున్నారు. మిగతా అన్ని రోజులు కామ్ గా ఉండి ఒక్క శనివారం మాత్రమే ఆయనకు షరతులు ఏమి వర్తించకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఆ రోజు ఏది అనుకుంటే అది చేయడానికి వెనకడాడు. అందుకే సింబాలిక్ గా టైటిల్ కూడా ‘సరిపోదా శనివారం’ అని పెట్టుకున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో వివేక్ ఆత్రేయ నానితో మాస్ సినిమా చేశారనే చెప్పాలి. ఇంతకుముందు దసరా లాంటి మాస్ సినిమా చేసి నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఆ ధైర్యంతోనే వివేక్ ఆత్రేయ కూడా తనతో మాస్ సినిమా చేసి సక్సెస్ అయ్యాడు… ఇక మొత్తానికి అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా కోసం అయినా వాడిన మేకింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది.మొదట్లో కొన్ని సీన్లు మినహా ఇస్తే ఎక్కడ కూడా ప్రేక్షకుల్ని కొంచెం కూడా బోర్ కొట్టించకుండా సినిమాను ముందుకు తీసుకెళ్ళాడు. ఇక నాని ఈ సినిమా తో వరుసగా మూడో సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాని ఈ సినిమాతో మరోసారి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన క్యారెక్టర్ లను మినహాయిస్తే ఈ క్యారెక్టర్ లో మాత్రమే తను పూర్తి ఎఫర్ట్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ఇక నాని ఇప్పటివరకు కామెడీ క్యారెక్టర్ లను ఎక్కువగా చేసేవాడు. కానీ ఫస్ట్ టైం ఒక సీరియస్ పాత్ర ను చేస్తూ చాలా డీప్ ఎలివేషన్స్ ఎమోషన్స్ తో మెప్పించాడు. ఇక ఎస్ జే సూర్య కూడా ఒక సైకో తరహా పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఇప్పటివరకు ఆయనకు మంచి సక్సెస్ లు వస్తున్నప్పటికీ తెలుగులో చెప్పుకోదగ్గ సక్సెస్ అయితే రావడం లేదు. దాని వల్ల ఆయనకు తెలుగు లో పెద్దగా ఆఫర్లు అయితే రావడం లేదు. ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక హీరోయిన్ గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులైనా అజయ్, మురళి శర్మ, సాయికుమార్ లాంటి నటులు అందరు కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ను ఇస్తూ సినిమా విజయంలో వాళ్ళు కూడా ఒక వంతుకు కీలకపాత్ర వహించారనే చెప్పాలి…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాకు మ్యూజిక్ అంత పెద్దగా ప్లస్ అవ్వకపోయినా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఆకట్టుకునే విధంగా ఉందనే చెప్పాలి. కొన్ని సీన్లలో బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే ఆ సీన్లకు తగ్గ ఎలివేషన్ గాని, ఎమోషన్ గాని వర్కౌట్ అయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జోక్స్ బోజే మ్యూజిక్ ని అందించి సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించాడు… ఇక ఈ సినిమాకి విజువల్స్ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి… ఎడిటింగ్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. అందుకే ప్రతి షాట్ ను షార్ప్ ఎడ్జ్ లో కట్ చేస్తూ తీసుకెళ్లారు…

ప్లస్ పాయింట్స్

కథ
డైరెక్షన్
నాని యాక్టింగ్

మైనస్ పాయింట్స్

ఇంట్రడక్షన్ సీన్స్ కొంచెం లాగ్ అయ్యాయి…
స్క్రీన్ ప్లే మధ్యలో కొంచెం స్లో అయింది…

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
మంచి యాక్షన్ సినిమాలు, నాని యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఫ్యామిలీ తో కలిసి ఈ సినిమా చూడవచ్చు…