ముల్లంగితో ఈ ఆహార పదార్థాలు తింటే విషంతో సమానం.. అవేమిటంటే..?

మనం ఎక్కువగా తినే కూరగాయలలో ముల్లంగి ఒకటనే సంగతి తెలిసిందే. కొంతమంది ముల్లంగిని సలాడ్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. ముల్లంగి ద్వారా శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఆంథోసైనిన్స్ లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ముల్లంగిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. డయాబెటిస్, క్యాన్సర్, ఉదరం, మూత్రపిండాలు, నోటి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ముల్లంగి వల్ల దూరమవుతాయి. ముల్లంగితో […]

Written By: Navya, Updated On : May 22, 2021 11:47 am
Follow us on

మనం ఎక్కువగా తినే కూరగాయలలో ముల్లంగి ఒకటనే సంగతి తెలిసిందే. కొంతమంది ముల్లంగిని సలాడ్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. ముల్లంగి ద్వారా శరీరానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఆంథోసైనిన్స్ లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్న ముల్లంగిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

డయాబెటిస్, క్యాన్సర్, ఉదరం, మూత్రపిండాలు, నోటి సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ముల్లంగి వల్ల దూరమవుతాయి. ముల్లంగితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సైతం చేకూరుతాయి. అయితే ఆయుర్వేదం మాత్రం ముల్లంగిని కొన్ని ఆహార పదార్థలతో అస్సలు తీసుకోకూడదని చెబుతోంది. ఒకవేళ అలా తీసుకుంటే మాత్రం ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

ముల్లంగిని తిన్న తరువాత పాలు, పాలతో తయారు చేసిన వస్తువులను అస్సలు తీసుకోకూడదు. వేర్వేరు స్వభావాలు కలిగి ఉన్న ముల్లంగి, పాలు తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు పెరగడంతో పాటు చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముల్లంగి తిన్న తరువాత పాలు, పాలతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాలంటే కనీసం 4 గంటల వ్యవధి ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే కాకరకాయ ముల్లంగిని ఒకే సమయంలో తీసుకుంటే ` శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. కీరదోస, ముల్లంగి ఒకే సమయంలో తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముల్లంగి తిన్న తరువాత నారింజను కొన్ని గంటల పాటు తీసుకోకూడని నిపుణులు చెబుతున్నారు.