Fruits: ప్రతిరోజు భోజనం మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వీటిలో భోజనంతో పాటు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి అవసరమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నేటి కాలంలో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని పండ్లలో షుగర్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తీసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా షుగర్ వ్యాధి లేనివారు సైతం పండ్లను పదేపదే తీసుకోవడం వల్ల శరీరంలోకి అధికంగా చక్కెరను పంపించినట్లు అవుతుంది. అయితే ఏ ఏ పండ్లలో ఎంత చక్కర శాతం ఉంటుంది? ఏ పండును తీసుకుంటే ఆరోగ్యం? పండ్లతోపాటు ఏమి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి?
నేటి కాలంలో ప్రతి పదార్థంలో షుగర్ శాతం ఎంతో కొంత ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉండే కొన్ని పదార్థాలను పదే పదే తీసుకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే టీ, కాఫీ లాంటి వాటిలో షుగర్ ఎంత మోతాదులో ఉంటుందో అందరికీ తెలుసు. దీంతో వీటిని తగ్గిస్తూ వస్తున్నారు. కానీ కొన్ని రకాల పండ్లలో కూడా షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని రకాల ప్రోటీన్ల కోసం పండ్లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటప్పుడు ఏ పండ్లు తక్కువ షుగర్ కంటెంట్ ను కలిగి ఉంటాయి?
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ తెలిపిన ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతిరోజు 30 గ్రాములకు మించి షుగర్ను తీసుకోకూడదు. ఒక టీ లో ఐదు గ్రాముల షుగర్ ఉంటుంది. ఈ లెక్కన కొన్ని రకాల స్వీట్స్ తింటే ఎక్కువ షుగర్ తీసుకున్నట్లే. మరి ఇదే సమయంలో పండ్లు కూడా తీసుకుంటే షుగర్ లెవెల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణ పనులు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ స్థాయిని కలిగి ఉంటాయి. కానీ ఖర్జూరాలు, కిస్మిస్ వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. మాగబెట్టిన పండ్లలో ఎక్కువ స్థాయిలో షుగర్ ఉంటుంది.
బ్లాక్ ద్రాక్ష, ఎండు ద్రాక్ష, బొప్పాయి, మామిడి, పుచ్చకాయ, అనాస పండు, కిస్మిస్ వంటి వాటిలో మధ్యస్థ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ మితంగా పెరుగుతాయి. అయితే ఇప్పటికే డయాబెటిక్ వ్యాధి ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. నిమ్మకాయ, దానిమ్మ, ఆపిల్, చెర్రీలు, స్ట్రాబెర్రీ వంటి వాటిలో గ్లైసేమి ఇండెక్స్ స్థాయి మితంగా ఉంటుంది. ఇలాంటి వాటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తక్కువగా పెరుగుతాయి. ఎండు ఖర్జూరం, పుచ్చకాయ వంటి వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పండ్లు తీసుకునేటప్పుడు వాటిలో ఉండే షుగర్ లెవెల్స్ ని బట్టి తీసుకోవడం మంచిది.