https://oktelugu.com/

Friendship: వయస్సు పెరిగే కొద్ది స్నేహితుల మధ్య బంధం తగ్గుతుందా? అయితే ఈ చిట్కాలు పాటించండి

స్నేహితులతో ఎప్పుడూ ఏదో విధంగా కాంటాక్ట్ ఉండండి. ఎంత బిజీగా ఉన్నా కనీసం నెలకి ఒకసారి అయిన ఒక ఫోన్, మెసేజ్ వంటివి చేస్తుండాలి. రోజూ ఇద్దరి మధ్య కమ్యునికేషన్ ఉండటం మంచిదే. కానీ రోజూ అంటే వర్క్, వ్యక్తిగత పనులు ఉంటాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 6, 2024 1:18 pm
    Friendship Day

    Friendship Day

    Follow us on

    Friendship: అన్ని బంధాల్లో స్నేహ బంధం చాలా ముఖ్యమైనది. చిన్నతనంలో మనం ఇంటి సభ్యులతో కంటే స్నేహితులతోనే ఎక్కువగా సమయం గడుపుతాం. నిజం చెప్పాలంటే చాలామందికి చిన్నతనం అంటేనే ఇష్టం. ఎందుకంటే ఎలాంటి బాధలు, ఆలోచనలు, ఆందోళనలు లేకుండా సంతోషంగా ఉండేది. అలా పెద్దయ్యిన తర్వాత బంధాలు, బాధ్యతలు, బంధుత్వాలతో బిజీ అయిపోతారు. ఈ క్రమంలో స్నేహితులతో తక్కువ సమయం గడుపుతారు. పెళ్లికి ముందు వరకు స్నేహితులను ఎక్కువగా కలుస్తుంటారు. కానీ పెళ్లి తర్వాత అసలు వాళ్ల కోసమే మర్చిపోతారు. ఒకప్పుడు గంటల తరబడి కూర్చొని మాట్లాడుకునేవారు.. వయస్సు పెరిగి బాధ్యతలు వచ్చేసరికి కనీసం పది నిమిషాలు కూడా కూర్చొని మాట్లాడే తీరిక లేకుండా పోతుంది. స్నేహితుల మధ్య బంధం తగ్గకుండా జీవితాంతం కొనసాగించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    కాంటాక్ట్‌లో ఉండాలి
    స్నేహితులతో ఎప్పుడూ ఏదో విధంగా కాంటాక్ట్ ఉండండి. ఎంత బిజీగా ఉన్నా కనీసం నెలకి ఒకసారి అయిన ఒక ఫోన్, మెసేజ్ వంటివి చేస్తుండాలి. రోజూ ఇద్దరి మధ్య కమ్యునికేషన్ ఉండటం మంచిదే. కానీ రోజూ అంటే వర్క్, వ్యక్తిగత పనులు ఉంటాయి. కాబట్టి స్నేహితులతో అప్పుడప్పుడు అయిన టచ్‌లో ఉండండి. ఈరోజుల్లో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటున్నారు. అలా ఉన్న సమయంలో ఏదో ఒక సమయంలో చిన్న మెసేజ్ లేదా గ్రూప్ కాల్ వంటివి చేస్తే ఫ్రెండ్ షిప్ బలపడుతుంది.

    మీ స్నేహితులకు ఏం ఇష్టమో తెలుసుకోండి
    చిన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు స్నేహితులకి ఏం ఇష్టమో తెలుస్తుంది. ఒక్కసారి దూరం అయిపోయిన తరవాత వాళ్లకి ఏం ఇష్టం, ఏం ఇష్టం లేదో కూడా తెలియదు. ఒకరి ఇష్టాలను తెలుసుకుని వీలు కుదిరినప్పుడు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లండి. స్నేహితుల కోసం సమయం కేటాయించుకుని కాఫీ, సినిమా లేదా పార్క్‌కి వెళ్లడం వంటివి చేయండి. కనీసం ఆరు నెలలకు ఒకసారి అయిన స్నేహితులను కలిసేలా ప్లాన్ చేసుకుంటే రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడుతుంది.

    కష్టాల్లో తోడు ఇవ్వండి
    ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కష్టాలు వస్తాయి. ఇలాంటి సమయంలో స్నేహితులకు మద్దతుగా ఉండాలి. ఆర్థిక పరంగా అయిన ఎమెషనల్‌గా అయిన కూడా సపోర్ట్ చేయాలి. దగ్గర ఉంటే కలిసి మద్దతు ఇవ్వడం, దూరంగా ఉంటే ఒక చిన్న ఫోన్ కాల్‌తో వాళ్లను పలకరిస్తే.. కాస్త హాయిగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వాళ్లతో ఉంటే ఎంత దూరాన ఉన్న ఫ్రెండ్‌షిప్ అలానే ఉంటుంది. వాళ్లకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వండి. చిన్నతనంలో ఎంతో క్లోజ్‌గా ఉంటారు. కానీ పెద్దయ్యిన తర్వాత అసలు స్నేహితులను పట్టించుకోరు. ఇలాంటి తప్పులు చేయకుండా.. మీ పిల్లల వరకు ఫ్రెండ్‌షిప్ ఉండేలా కాపాడుకోండి.