మారుతున్న కాలంతో పాటే ప్రజల ఆహారపు అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులలో చాలామంది వేర్వేరు కారణాల వల్ల రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకుంటున్నారు. వైద్య నిపుణులు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటల లోపే భోజనం చేయాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.
విద్యార్థులు, యువతలో చాలామంది టీవీలు, మొబైల్ ఫోన్ల వల్ల రోజూ ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. రాత్రి 8 గంటల తరువాత ఆహారం తీసుకుంటే శరీరంలో బాడీ మాస్ ఇండెక్స్ పెరుగుతుంది. ఆలస్యంగా భోజనం చేసేవాళ్లు శరీరంలో కొవ్వు శాతం పెరగడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి సమయంలో స్నాక్స్ కూడా తినవద్దని స్నాక్స్ తిన్నా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో గ్యాస్ సమస్య చాలామందిని వేధిస్తోందని రోజూ ఒకే సమయంలో భోజనం చేస్తూ భోజనం చేసిన తరువాత అరగంట వ్యాయామం చేస్తే గ్యాస్ సమస్య బారిన పడే అవకాశాలు ఉండవని నిపుణులుఅన్నారు. ఆహారం సరైన సమయానికి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.
శరీరంలోని చాలా సమస్యలకు గ్యాస్ కారణం కాబట్టి సరైన సమయానికి భోజనం చేయాలని.. రాత్రి భోజనానికి, నిద్రకు కనీసం రెండు నుంచి మూడు గంటల తేడా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే సమయం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.