
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది ముందు నుంచి భిన్న శైలి. ఏపీ రాజకీయాల్లో ఆయన పార్టీది విభిన్న సిద్ధాంతం. పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. అయితే.. ఇప్పుడు జనసేనాని రూటు మార్చినట్లు కనిపిస్తోంది. ఫ్యాన్ బేస్ తో పార్టీ నడవదని డిసైడ్ అయినట్లుగా స్పష్టమవుతోంది. ఏపీ రాజకీయాలకు కుల సమీకరణ కూడా అవసరమని డిసైడ్ అయినట్లు సమాచారం. అందుకే బలమైన సామాజిక వర్గాలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారట.
Also Read: అచ్చెన్నాయుడిని మళ్లీ బుక్ చేస్తున్న సీఎం జగన్?
సాధారణంగా ఏ నేత అయినా బహిరంగ సభ పెడుతున్నారంటే.. ఆయనకు ఉన్న పలుకుబడిని బట్టి.. ఆసక్తిని బట్టి జనం వస్తుంటారు. అయితే.. వచ్చినవారంతా తమకే ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే. అలా వేసి ఉంటే.. ఈ పాటికి పవన్ అసెంబ్లీలో కాదు ఏకంగా సీఎం సీట్లో కూర్చునే వారే. కానీ.. ఫ్యాన్ బేస్ జనసేనను నిలబెట్టలేదు. జనసేనకు వచ్చే మద్దతు, బలం, బలగం అంతా సోషల్ మీడియాలోనూ, బహిరంగ సభల్లో మాత్రమే. కానీ.. బ్యాలెట్‌కు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది.
Also Read: ఏపీ అధికారుల పరువు గంగపాలు.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
అందుకే.. జనసేనకు ఓట్లు ఆశించిన స్థాయిలో దక్క లేదు. దీంతో పవన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ పాలిటిక్స్ కాదు.. ఇక క్యాస్ట్ పాలిటిక్స్‌కు వెల్‌కం చెప్పాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక తాను కూడా పక్కా ట్రెడిషనల్ పొలిటీషియన్ గా మారాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో అత్యధిక జనాభా కాపులదే. కాపులు ఎటువైపు ఉంటే ఆ పార్టీదే అధికారం. స్వతహాగా కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ కు వారి ఓట్లు పెద్దగా పడలేదు. గత ఎన్నికల్లో కాపులంతా వైసీపీకి ఓట్లు వేశారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ భీమవరం, గాజువాకలో పవన్ ఓటమి. దీనికి కారణం కూడా లేకపోలేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
తాను కుల రాజకీయాలు చేయనని.. కులాలు, మాతాలకు తాను అతీతుడినని పవన్ ప్రకటించడంతో కాపులు పవన్‌ను తమవాడిగా భావించలేదనే చర్చలు సాగాయి. దీంతో ఇప్పుడు పవన్ రూటు మార్చినట్లు తెలుస్తోంది. త్వరలో కాపు సంక్షేమ సేనతో పవన్ కల్యాణ్ భేటీ అవుతానని ప్రకటించడంతో పవన్ కాపులను తనవైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ లో కాపు రిజర్వేషన్, కాపుల సమస్యలు, వారి కోసం కేటాయించిన నిధులపై చర్చిస్తామన్నారు. ఈ ఒక్క ప్రకటనతో . కాపులను దగ్గర చేసుకునేందుకే పవన్ ఈ మీటింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.