అచ్చెన్నాయుడిని మళ్లీ బుక్ చేస్తున్న సీఎం జగన్?

ఏపీలో విగ్రహాలు, ఆలయాల ధ్వంసం కేసుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే దీనిపై పలు మార్లు సమీక్షించిన సీఎం వైఎస్. జగన్ నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని.. కుల, మత విధ్వేషాలకు రెచ్చగొడితే… ఊరుకునేది లేదని అన్నారు. ఈ విషయమై పోలీసులకు సైతం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు..జగన్ ఆదేశాలతో ఆలయాలపై దాడుల కేసుల్లో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర […]

Written By: NARESH, Updated On : January 28, 2021 3:11 pm
Follow us on

ఏపీలో విగ్రహాలు, ఆలయాల ధ్వంసం కేసుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే దీనిపై పలు మార్లు సమీక్షించిన సీఎం వైఎస్. జగన్ నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని.. కుల, మత విధ్వేషాలకు రెచ్చగొడితే… ఊరుకునేది లేదని అన్నారు. ఈ విషయమై పోలీసులకు సైతం కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు..జగన్ ఆదేశాలతో ఆలయాలపై దాడుల కేసుల్లో విచారణను వేగవంతం చేశారు పోలీసులు.

ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. సంత బొమ్మాళి పాలేశ్వర స్వామి ఆలయం నంది విగ్రహం తరలింపు కేసులో విచారణకు హాజరు కావాలని ఆయనకు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈనెల 14న నంది విగ్రహాన్ని తరలించి పక్కనే ఉన్న మూడు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ప్రతిష్టించి పట్టుబడిన టీడీపీ నేతలు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విగ్రహం తరలింపు రోజుముందు వీరంతా అచ్చెన్నాయుడుని కలిసినట్లు పోలీసులు నిర్ధారించారు. బుధవారం అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు జారీ చేశారు.

కాగా అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం పరిధిలోని సంత బొమ్మాళి మండలంలో మత విధ్వేశాలు సృష్టించేందుకు టీడీపీ నాయకులు యత్నించినట్టు ఆరోపణలున్నాయి.. పాలేశ్వర స్వామి ఆలయంలో శిథిలమైన నంది విగ్రహాన్ని తొలగించి కొత్త నంది విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్టించారు. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు శిథిలావస్థకు చేరిన పాత నంది విగ్రహాన్ని తీసుకొచ్చి ఆగమ శాస్త్ర పద్ధతులకు విరుద్ధంగా పాలేశ్వరస్వామి జంక్షన్‌ వద్ద గల సిమెంట్‌ దిమ్మెపై ఈ నెల 14న గుట్టుచప్పుడు కాకుండా ప్రతిష్ఠించారు.

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఇక్కడ దిమ్మె నిర్మించగా.. మత విద్వేషాలను రెచ్చగొట్టడంతోపాటు అక్కడ వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవాలన్న ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బ్యాచ్‌ పక్కా ప్లాన్‌తో ఆ దిమ్మెపై నంది విగ్రహాన్ని నెలకొల్పారని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం.. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు అచ్చెన్నాయుడుకు నోటీసులు జారీ చేశారు. మరోసారి ఆలయాలపై దాడుల కేసుల్లో ఏకంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడినే బుక్ చేసి ప్రజల ముందు టీడీపీని దోషిగా నిలబెట్టేందుకు జగన్ రెడీ అయ్యారు.