https://oktelugu.com/

Tea: టీ తాగడం వల్ల నల్లగా మారుతారా?

టీ తాగడానికి ప్రజల ఛాయతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు నిపుణులు. టీ తాగడం వల్ల నల్లగా మారుతారు అనడం కేవలం అపోహ మాత్రమేనట. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అంటున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 10, 2024 8:30 am
    Tea

    Tea

    Follow us on

    Tea: టీని ఇష్టపడని వారు ఎవరు ఉంటారు. టీ అంటే అందరికీ ఇష్టమే. ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా టీ మాత్రం ఉదయం సాయంత్రం ఓ సిప్ పడాల్సిందే అంటారు చాలా మంది. మరి టీ తాగడం వల్ల కొందరు రంగు మారుతారు అనుకుంటారు. నిజంగానే టీ తాగితే కలర్ మారుతారా? నల్లగా అవుతారా అనే వివరాలు తెలుసుకుందాం. కొందరు దీనిని నిజం అని అంగీకరిస్తే.. మరికొందరు దీనిని పుకారు అంటారు. మీరు కూడా ఈ విషయంలో అయోమయంలో ఉన్నట్లయితే, ఈ రోజు ఆరోగ్య నిపుణులు ఏమని చెప్పారో ఓ సారి లుక్ వేయండి.

    టీ తాగడానికి ప్రజల ఛాయతో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు నిపుణులు. టీ తాగడం వల్ల నల్లగా మారుతారు అనడం కేవలం అపోహ మాత్రమేనట. ఈ విషయంలో సందేహం అవసరం లేదు అంటున్నారు. వ్యక్తుల చర్మ రంగు వారి జన్యుపరమైన కారకాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మీరు ఎంత టీ తాగినా అది మీ ఛాయపై ప్రభావం చూపదు అని తేల్చి చెప్పారు. చాలా వేడిగా ఉన్న టీ తాగడం వల్ల కొన్నిసార్లు పెదవులపై పిగ్మెంటేషన్ ఏర్పడవచ్చు, కానీ టీ పెదవుల రంగును మార్చదు.

    టీని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్ల లోపం ఏర్పడుతుందని.. అందుకే పరిమితిగా మాత్రమే టీ తాగాలి అని సలహా ఇస్తున్నారు. కొందరు స్కిన్ కలర్ ఫెయిర్ గా ఉండేలా ట్రీట్ మెంట్ తీసుకుంటారు, అయినా కూడా స్కిన్ కలర్ శాశ్వతంగా మార్చుకోలేకపోతారు. కొంత సమయం తరువాత, చర్మం దాని సహజ రూపానికి తిరిగి వస్తుంటుంది. వేసవిలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రజలు తగిన మోతాదులో నీరు తాగాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల చర్మం మెరుగుపడుతుంది.

    ప్రజలు తమ రోజును టీతో ప్రారంభిస్తారు. టీ లేకుండా రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది. అన్ని కాలాల్లో టీ తాగడానికి అందరూ ఇష్టపడతారు.కొందరికి మసాలా టీ అంటే ఇష్టం ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయట.కానీ టీ విషయంలో కాస్త జాగ్రత్త. లిమిట్ గా తీసుకోండి.