అన్నం ఎక్కువగా తింటే ఊబకాయం వస్తుందా.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే?

మన దేశంలోని ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో అన్నం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. బియ్యంను ఉడికించటం ద్వారా అన్నంను తయారు చేయడం జరుగుతుంది. మనలో చాలామందికి ఇష్టమైన ఆహారాలలో అన్నం ఒకటనే విషయం తెలిసిందే. అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అతిగా అన్నం తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనే అన్నాన్ని ఎక్కువగా తింటారో వాళ్లు డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ అయితే […]

Written By: Navya, Updated On : November 2, 2021 10:38 am
Follow us on

మన దేశంలోని ప్రజలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో అన్నం కూడా ఒకటనే సంగతి తెలిసిందే. బియ్యంను ఉడికించటం ద్వారా అన్నంను తయారు చేయడం జరుగుతుంది. మనలో చాలామందికి ఇష్టమైన ఆహారాలలో అన్నం ఒకటనే విషయం తెలిసిందే. అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. అతిగా అన్నం తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది.

ఎవరైనే అన్నాన్ని ఎక్కువగా తింటారో వాళ్లు డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటికే మధుమేహం సమస్యతో బాధ పడుతున్న వాళ్లు అన్నం తినకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. అన్నం సులభంగా జీర్ణం కావడం వల్ల పదేపదే ఆకలి అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా అతిగా ఆహారం తీసుకోవడంతో పాటు ఊబకాయం బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.

తెల్ల అన్నంలో ఫైబర్ చాలా తక్కువమొత్తంలో ఉంటుంది. అన్నం ఎక్కువగా తీసుకునే వాళ్లు అసిడిటీ, గ్యాస్ సమస్యతో బాధ పడే అవకాశాలు ఉంటాయి. తెల్ల అన్నం ఎక్కువగా తినడం వల్ల బలహీనమైన జీర్ణక్రియకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అన్నంలో విటమిన్ సి తక్కువగా ఉండటం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అన్నం తినడం వల్ల బాగా నిద్రపోయే అవకాశం ఉండటంతో పాటు అలసట, నీరసం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. తెల్లటి అన్నాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలతో పోలిస్తే నష్టాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.