Head Injuries : ప్రస్తుత రోజుల్లో ఓ వ్యాధి పిల్లలను చాలా భయపెడుతుంది. అదేనండి ఎపిలెప్సీ వ్యాధి అంటే మూర్చ వ్యాధి. మెదడుకు సంబంధించిన ఈ వ్యాధి భయంకరమైన పరిణామాలను కలిగిస్తుంటుంది. దీని వల్ల పిల్లలు ఎక్కడైనా పడిపోవచ్చు. లేదా మూర్చపోయే అవకాశాలు కూడా ఎక్కువే. మరి ఇంత తీవ్రతను కలిగించడానికి ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? దీన్ని నివారించవచ్చా. ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూసేయండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు.
5 నుంచి 10 సంవత్సరాల పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నతనంలో తలకు బలమైన గాయం అయినా జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఈ మూర్చ వ్యాధి రావచ్చు. దీని వల్ల శిశువు మానసిక అభివృద్ధి ఆగిపోయే సమస్య ఉంటుంది అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులలో ఈ సమస్య ఉంటే బిడ్డకు కూడా వస్తుంటుంది. మూర్చ లక్షణాలు 60 శాతం మంది రోగుల్లో బాల్యంలోనే కనిపిస్తాయి. 80-90 శాతం కేసుల్లో మాత్రమే పెరుగుతున్న కొద్ది తిమ్మరి సమస్యగా వచ్చి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతుంటారు.
తెల్లవారుజామున ఈ తిమ్మిర్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. మార్చు 5 నుంచి 15 సంవత్సరాల ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు 70 నుంచి 80 సంవత్సరాల మధ్యలో కూడా అభివృద్ది చెందే ఆస్కారం ఉంటుందట. పుట్టుకతో చాలా తక్కువ మందికి వస్తుంటుందట. ఇది వచ్చినప్పుడు శరీరం సమతుల్యతను కోల్పోయి అవయవాలు మొద్దుబారి పోతాయి. దీంతో ఆ వ్యక్తి నేలపై పడతారు. దంతాలు, దవడలు బిగించుకుపోతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధి.
తక్షణ చికిత్స ఉంటే సకాలంలో మందులు వాడితే మూర్చ వ్యాధిని నయం చేసుకోవచ్చు. ఇక పిల్లల పుట్టక లోపం వల్ల కూడా వారికి రావచ్చు. డెలివరీ సమయంలో ఆక్సిజన్ లేకపోవడం, బాల్యంలో తీవ్రమైన గాయాలు తలకు తాకడం వల్ల కూడా రావచ్చు. 60-70 కేసులు మందులతో నయం అవుతున్నాయి. మరి మూర్ఛ వస్తే భయపడకండి. వైద్యులను సందర్శించండి.