పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమందిని డయాబెటిస్ సమస్య వేధిస్తోంది. యువతలో చాలామంది డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. అయితే పిల్లల్లో మధుమేహం సాధారణంగా కనిపిస్తున్న నేపథ్యంలో పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ప్యాంక్రియాస్ సరిగా పని చేయని పక్షంలో కూడా డయాబెటిస్ బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది.
పిల్లల ప్రవర్తనలో తరచూ మార్పులు, చికాకు కనిపిస్తుంటే మధుమేహానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఊబకాయం వల్ల శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఊబకాయంతో బాధ పడే పిల్లలు ఉన్న దేశంలో మన దేశంలో సెకండ్ ప్లేస్ లో ఉంది. పిల్లలు, యుక్తవయస్సులో ఉన్నవాళ్లపై డయాబెటిస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
రెండేళ్ల క్రితం విడుదలైన ఒక సర్వే ప్రకారం ప్రతి పది మంది పిల్లలలో ఒకరు డయాబెటిస్ తో బాధ పడుతున్నారు. జీవనశైలి, అనారోగ్య అలవాట్లు, పొగాకు వాడకం కూడా మధుమేహానికి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.