US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో వారం రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో అధ్యక్షులు ఎవరైతే తమకు అనుకూలం అనే అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో భారతీయులు కూడా మన దేశానికి అనుకూలంగా ఉండే నేత ఎవరు అన్న అంచనాకు వస్తున్నారు. ఇప్పటికే భారతీయ అమెరికన్లు భారత సంతతి అభ్యర్థి కమలా హారిస్‌వైపు మొగ్గు చూపారని సర్వేలు చెబుతున్నాయి. అయితే భారతీయ నేపథ్యం ఉన్నప్పటికీ కమలా హారిస్ భారత్‌కు అనుకూలంగా ఉంటారని చెప్పలేం. ఆమె జన్మతహ అమెరికా పౌరురాలు. ఈ నేపథ్యంలో భారతీయుల గురించి ఆమె పెద్దగా ఆలోచించకపోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవి ఇబ్బందికరం
కమలా హారిస్ గెలిస్తే కశ్మీర్ లాంటి కీలక అంశాల్లో భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఆమె స్పందించారు. కశ్మీరీలు ఒంటరి కాదని నేను భావిస్తున్నా. అక్కడ ఇపరిస్థితిని మేము గమనిస్తున్నాం. అవసరమైతే జోక్యం చేసుకుంటాం అని హారిస్ వ్యాఖ్యానించారు. అంటే భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యానికి ఆమె వెనుకాడబోరని స్పష్టత ఇచ్చారు. ఇక మోదీతో కూడా కమలాకు పెద్దగా సఖ్యత లేదు. మోదీ అమెరికా వెళ్లిన సమయంలో ఆమె ఒక్కసారి కూడా మోదీతో భేటీ కాలేదు. మోదీ కూడా కమలాను పెద్దగా పట్టించుకోలేదు.
బైడెన్ విధానాలు…
ఇక భారతీయుల హక్కులు, ప్రజాస్వామ్యం గురించి కూడా కమలా ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారు. మైనారిటీలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్త ంచేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పైనా స్పందించారు. కెనడా వివాదం విషయంలోనూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ కెనడాకే మద్దతు ఇచ్చారు. ఇక కమలా రన్నింగ్‌మేట్ టిమ్ వాల్ట్‌తోనూ భారత్‌కు ఇబ్బందే. ఆయన పూర్తిగా చైనా అనుకూలవాది.
కమలతో ఇవి అనుకూలం..
ఇక డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అధ్యక్షరాలు అయితే భారత్‌కు హెచ్–1బీ వీసాలు ఉదారంగా ఉండే అవకాశం ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో కూడా భారత్‌కు హారిస్ అండగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ట్రంప్ అధ్యక్షుడయితే..
ఇక ట్రంప్ విధానాలపైనా చర్చ జరుగుతోంది. 2016 నుంచి 2020 వరకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ భారత్‌తో సానుకూల వైఖరితోనే ఉన్నారు. నరేంద్రమోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం కూడా ట్రంప్ అధ్యక్షుడు కావాలని కోరుకుంటోంది. ట్రంప్–మోదీ అలహాబాద్‌లో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. అమెరికాలో కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నా ్రంప్ హయాంలోనే ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి.
జోక్యం తగ్గొచ్చు
ట్రంప్ అధ్యక్షుడు అయితే.. భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగ్గుతుంది. చైనాపై ట్రంప్ కఠిన వైఖరి అవలంబిస్తారు. ఆమెరికా వాణిజ్య సప్లయ్ చెయిన్ చైనాపై ఆధారపడకుండా చూస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది భారత్‌కు లాభం కలిగించే అంశం. ఇక ట్రంప్ పదవిలోకి వస్తే రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల్లోనూ మారుప వస్తుంది. యుద్ధంతో ఇప్పటికే అన్ని దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయి. యుద్ధం ఆగితే భారత్‌తోపాటు చాలా దేశాలక మేలు జరుగుతుంది.
సుంకాల పెంపు..
ట్రంప్ అధ్యక్షుడు అయితే భారత్‌కు అంతా మేలే జరుగుతుందని అనుకోవడానికి కూడా లేదు. భారత వాణిజ్య విధానాలు అమెరికాకు నష్టం చేకూరుస్నాయని ట్రంప్ విమర్శించారు. భారత్‌ను ఆయన సుంకాల రాజుగా అభివర్ణించారు. ఇపుపడు అదే మాటపై ఉన్నారు. అధికారంలోకి వస్తే భారత వస్తువుల దిగుమతిపై సుంకం పెంచే అవకాశం ఉంది. వాణిజ్యపరంగా ఇది భారత్‌కు ఇబ్బందే.