Marriage: ఫుల్ గా పెళ్లిళ్ల సీజన్.. ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతుంది నువ్వు ఎప్పుడు చేసుకుంటవ్? నీ తోటి వారు కూడా వెళ్లిపోతున్నారు నువ్వు ఎప్పుడు అత్తారింటికి వెళ్తావ్? పెళ్లి భోజనం పెట్టవా అంటూ ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలు వినిపిస్తుంటాయి. అయితే తొందరగా పెళ్లికి కమిట్ అయ్యారనుకోండి ఇక అంతే సంగతులు. పెళ్లి చేసుకునే ముందు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోండి. అంతే కాదు ఈ ప్రశ్నలు ఒకసారి వేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోండి.
పెళ్లి చేసుకోవడానికి సిద్దమేనా?
అమ్మానాన్న సంబంధాలు చూస్తున్నారు. చుట్టాలు పదేపదే అడుగుతున్నారు.. ఫ్రెండ్స్ అందరికి పెళ్లి అవుతుంది అంటూ మీరు తొందర పడకండి. ముందుగా మీరు పెళ్లికి సిద్దమా కాదా? పెళ్లి చేసుకునే ఆలోచనలో ఇంతకీ మీరు ఉన్నారా లేదా అనే విషయాలను తెలుసుకోవాలి.
అవతల వ్యక్తితో కలిసి జీవించగలుగుతారా?
పెళ్ళికి సిద్దమే అని తెలిసిన తర్వాత ఈ ప్రశ్నను రెండవ సారిగా వేసుకోవాల్సిందే. ఇంతకీ అవతల వ్యక్తితో ఇమడ గలమా? పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటాయి. మరి ఆ తర్వాత? ఆమె/అతను అభిరుచులు, అలవాట్లు వంటివి వాటికి రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు కదలగలమా లేదా అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. లేదా దంపతుల మధ్య చాలా గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది.
సంబంధంలో ఏం చూస్తారు?
ఒక వ్యక్తితో జీవించాలి అంటే ఆ వ్యక్తి మనకు నచ్చాలి. ఈ రోజు సంతోషంగా ఒప్పుకున్న తర్వాత రేపు బాధ పడే అంశాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా పరీక్షించుకోవాలి. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత విడిపోవడం కష్టం. అందుకే పెళ్లికి ముందే ఆ వ్యక్తిలో మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు మీరు కోరుకునే అంశాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోండి.
బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అన్నింటి కంటే ఇది మరొక ముఖ్యమైన విషయం. పెళ్లి అయిన తర్వాత చాలా విషయాలకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కొన్ని బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా, కుటుంబ పరంగా కొన్ని మీరు చక్కబెట్టే పనులు ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా ఆలోచించండి.
మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే.. కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోండి.