Cough Syrup: ఏదైనా అనారోగ్యం ఏర్పడితే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకొని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. దీంతో కొన్ని రోజుల తర్వాత అనారోగ్యం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆస్పత్రికి వెళ్తే రోగం నయం కావడం అటుంచి ప్రాణాలే పోతున్నాయి. ముఖ్యంగా అభం, శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు పోవడంపై ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇటీవల దగ్గు, జలుబు వస్తే ఆస్పత్రికి వెళ్లి.. ఆ తర్వాత వైద్యులు ఇచ్చిన సిరప్ వాడడం వల్ల చాలామంది పిల్లల ప్రాణాలు పోయాయి. దీంతో ఇప్పుడు దగ్గు, జలుబు సిరప్ అంటే భయపడిపోతున్నారు. ఈ సిరబ్ లో ఉండే అనేక రసాయన కారకాలు.. నాణ్యత లేకుండా ఉండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. అసలు దగ్గు, జలుబు సిరప్ వాడడం వల్ల ఏం జరిగింది? ఈ సిరప్ ఎంతమంది ప్రాణాలను బలిగొన్నది?
రాజస్థాన్లో తాజాగా విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండు వారాల్లో ఇక్కడ చాలామంది చిన్నారులు దగ్గు, జలుబు సిరప్ వాడడం వల్ల మరణించినట్లు తేలింది. సెప్టెంబర్ 28న రాజస్థాన్లోని చిరానాలో ఐదు ఏళ్ల నితీష్ దగ్గుతో బాధపడుతుండగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అతడిని పరీక్షించిన తర్వాత వైద్యులు కాఫ్ సిరప్ ఇచ్చారు. ఇది తాగిన నితీష్ ఉదయం లేవలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అలాగే మధ్యప్రదేశ్ లోని చిందువాడ జిల్లాలో కలుషితమైన దగ్గు మందు తాగడం వల్ల 15 రోజుల్లో 9మంది చిన్నారుల కిడ్నీలు విఫలమై మరణించినట్లు తేలింది.
దీంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. గతంలోనూ దగ్గు మందు వాడటం వల్ల గాంబియా, ఉజ్జకిస్తాన్ దేశంలో చిన్నారులు మరణించినట్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న దగ్గు మందుల్లోనూ కలుషితమైనవి.. కొన్ని ప్రాణాలు తీసే రసాయన కారకాలు ఉన్నట్లు వైపులో తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరఫరా చేసే డ్రగ్స్ పై నియంత్రణ చేశారు. మధ్యప్రదేశ్లో సరఫరా అయిన దగ్గు మందులో ఎలాంటి కారకాలు ఉన్నాయని దానిపై పరిశోధన ప్రారంభించారు.
అయితే కొంతమంది నిపుణులు తెలుపుతున్న ప్రకారం చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు cold rif,nextro ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఎక్కువగా కలుషితమైనట్లు కొందరు వైద్యులు అనుమానిస్తున్నారు అంతేకాకుండా ఈ దగ్గు మందులో dextro methorfan hybromid ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీటితో కిడ్నీలు పాడైపోయి ఆ తర్వాత మరణించినట్లు చెబుతున్నారు.
అయితే చాలావరకు దగ్గు, జలుబు వస్తే స్వయంగా అవి తగ్గిపోతాయని.. కొన్ని రోజులు వెయిట్ చేయాలని అంటున్నారు. దగ్గు జలుబు వస్తే సిరప్ ప్రత్యేకంగా వాడొద్దని అంటున్నారు. అంతేకాకుండా ఐదు సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు ఎలాంటి సిరబ్ వాడొద్దని చెబుతున్నారు. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు వైద్యుల చికిత్స తర్వాత వారి సూచనలు మేరకే అవసరమైన మందులు తీసుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా ఇవి తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెబుతున్నారు.