రాత్రిపూట సెల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ వ్యాధి ఖాయం!

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్లో భాగమైపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని మనకు దర్శనమిస్తారు. మన 24 గంటలు జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. అయితే సెల్ ఫోన్ రాత్రి సమయంలో ఎక్కువగా వాడటం వల్ల అనేక రకాల వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు రాత్రి సమయంలో సెల్ ఫోన్ ,ల్యాప్టాప్ వంటి […]

Written By: Kusuma Aggunna, Updated On : November 19, 2020 10:30 am
Follow us on

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఆన్లైన్లో భాగమైపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని మనకు దర్శనమిస్తారు. మన 24 గంటలు జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. అయితే సెల్ ఫోన్ రాత్రి సమయంలో ఎక్కువగా వాడటం వల్ల అనేక రకాల వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు రాత్రి సమయంలో సెల్ ఫోన్ ,ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకపోవడం ఎంతో మంచిదని తెలియజేస్తున్నారు. రాత్రి సమయంలో అధికంగా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడడం వల్ల ఎలాంటి వ్యాధులకు గురవుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం….

ఎలక్ట్రానిక్ పరికరాలు రాత్రి సమయంలో ఎక్కువగా వాడటం వల్ల అందులో నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నిద్రను తగ్గించడమే కాకుండా, క్రమంగా శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత చర్యలకు దారితీస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా నైట్ డ్యూటీ చేసే వారిలో పరిశోధనలు చేయడంతో వారిలో ఎక్కువగా గుండె సమస్యలు,టైప్2 డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన వారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. ఈ వ్యాధి నిర్మూలించడానికి సరైన మందులు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందుల వల్ల కేవలం గ్లూకోజ్ స్థాయిలను మాత్రమే అదుపులోకి తీసుకురావచ్చు.

రాత్రి సమయంలో సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి అధిక మొత్తంలో వెలువడే నీలి రంగు కాంతి వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి టైప్ 2 డయాబెటిస్ కి కారణమవుతాయని, ఈ పరిశోధనలో తేలింది. కాంతి వెలువడే రాత్రి సమయంలో బ్లూ లైట్స్ కింద పనిచేసే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, దీనివల్ల రాత్రిపూట నిద్ర లేకుండా అనిపించడం వల్ల అధిక ఆకలి, అధిక బరువు పెరగడం, రక్తపోటుకు దారితీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వీలైనంత వరకు రాత్రి కూడా ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం వల్ల ఇటువంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు.