https://oktelugu.com/

క్రిష్‌పై గుర్రుగా ఉన్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిన సంగతి తెల్సిందే. అటూ రాజకీయాల్లో ఉంటూనే ఇటూ సినిమాలు చేస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. పవన్ రీ ఎంట్రీగా మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోంది. ఈ మూవీ సమయంలోనే పవన్ వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటయ్యాడు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేశాయి. Also Read: మహేష్ బాబు చిల్ అవడానికి ఏం చేస్తాడో తెలుసా? ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ […]

Written By: , Updated On : November 19, 2020 / 10:32 AM IST
Follow us on

Director Krish

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిన సంగతి తెల్సిందే. అటూ రాజకీయాల్లో ఉంటూనే ఇటూ సినిమాలు చేస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. పవన్ రీ ఎంట్రీగా మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోంది. ఈ మూవీ సమయంలోనే పవన్ వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటయ్యాడు. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేశాయి.

Also Read: మహేష్ బాబు చిల్ అవడానికి ఏం చేస్తాడో తెలుసా?

‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటించనున్నాడు. చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇటీవల టాలీవుడ్లో సినిమాల సందడి మొదలుకాగానే పవన్ సైతం షూటింగుల్లో పాల్గొంటున్నాడు.

పవన్ కల్యాణ్-క్రిష్ కాంబో సైట్స్ పైకి వెళ్లనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెల్సిందే. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ షూటింగ్ వాయిదా పడటంతో వచ్చిన గ్యాప్ లో క్రిష్ చారిత్రక మూవీపై మరింత స్క్రీప్టు పనులు చేయాల్సిందిబోయి కొత్త సినిమాను ప్రారంభించాడు. ‘కొండపొలెం’ నవలను సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వైష్ణవ్ తేజ్.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ తో రానానే.. ఫిక్స్

నిజానికి పవన్ అనుమతితోనే క్రిష్ ‘కొండపొలెం’ సినిమాను తెరకెక్కుస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తో సినిమా మధ్యలో వచ్చిన గ్యాప్ లో ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తోనే క్రిష్ మూవీ చేస్తున్నాడు. దీంతో పవన్ నుంచి సినిమాకు అభ్యంతరం లేదని తెలుస్తోంది. అయితే పవన్ లాంటి స్టార్ హీరోతో చారిత్రక మూవీ చేస్తున్నప్పుడు ఆ సినిమాపై ఫోకస్ పెట్టకుండా కొత్త సినిమాను చేయడంపై  ఆయన అభిమానులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఈ సినిమా ఫలితం మరోలా వస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ నుంచి క్రిష్ తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదనే టాక్ విన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్