Sweating while eating: మన ఆహారం తినేటప్పుడు ఎన్నో రకాల పదార్థాలను తీసుకుంటూ ఉంటాం. ఇందులో కొన్ని మలినాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన శరీరం కేవలం మంచి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. మలినాలను శుద్ధి చేసి మూత్రం లేదా చెమట రూపంలో బయటకు పంపుతుంది. కొందరి శరీరంలో చెమట ఎక్కువగా వస్తుంది. అయితే ఇలా చెమట ఎక్కువ రావడంతో ఆందోళన పడిపోతూ ఉంటారు. అంతేకాకుండా కొందరు అన్నం తినేటప్పుడు కూడా తీవ్రమైన చెమట వస్తుంది. ఇలా చెమట వచ్చినప్పుడు ఆహారాన్ని తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఆహారం తినేటప్పుడు చెమట రావడం నిజంగా ప్రమాదకరమైనా?
శరీరంలో ఉన్న వేడిని తగ్గించడానికి చర్మం ద్వారా బయటకు విడుదల అయ్యే నీటిని చమట అంటాం. దీనిని శరీరంలో కూలింగ్ సిస్టం అని కూడా పేర్కొంటారు. అయితే ఇటీవల కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఆహారం తీసుకునేటప్పుడు చెమట వస్తే ప్రమాదకరమని అంటున్నారు. ఆహారం తినడం వల్ల చెమట రాదు. ఆహారంలో ఉండే పదార్థాల వల్ల చెమట వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనినే గస్టేటరీ సెట్టింగ్ అని అంటారు. అంటే ఆహారం వేడిగా ఉన్నప్పుడు లేదా ఆహారంలో మిరపకాయలు, మసాలాలు ఉండడం వల్ల నోటిలోని నాడులను ఉద్రేక పరుస్తుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే భాగానికి సంకేతం పంపుతాయి. అంటే తినే ఆహారం వేడి ఉందని లేదా ఎక్కువగా కారం ఉందని తెలుపుతుంది. దీంతో మెదడు దానిని తట్టుకోలేక నుదురు, ముఖం, మెడ దగ్గర చెమట వచ్చేలా చేస్తుంది. అలాగే వేడి సూప్, కాఫీ తాగినప్పుడు కూడా ఉష్ణోగ్రత పెరిగి చెమట రూపంలో బయటకు వస్తుంది.
అంటే ఒక వ్యక్తి ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు చెమట వస్తుందంటే ఆ వ్యక్తి మెదడుకు ఆహారం ఇష్టం లేదని చెబుతుందన్నమాట. అంటే ఆ వ్యక్తి ఎక్కువగా మసాలా ఫుడ్ తీసుకోవడం ఆపేయాలి. లేదా కాఫీ, టి వంటి కెఫెన్ కలిగిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా చెమట వచ్చినా కూడా ఆహారాన్ని తీసుకుంటే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే కొందరు మసాలా ఎక్కువగా తీసుకోకుండా కూడా ఇతర కారణాలవల్ల చెమట వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివారు చల్లటి ప్రదేశంలో కూర్చుని భోజనం చేయాలి. అలాగే వేడి వాతావరణం లో వేడి పానీయాలు తగ్గించడం మానేయాలి. వేడి వాతావరణం లో ఎక్కువగా చల్లటి నీరు తీసుకోవాలి.
ఎక్కువగా చెమట వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేస్తే శరీరంలో డిహైడ్రేషన్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా ఎక్కువగా చెమట వచ్చిన వారు నీరు తాగుతూ ఉండాలి. శరీరంలో నుంచి నీరు పోయిన శాతాన్ని భర్తీ చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. లేకుంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.