Diabetes: వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం కూడా ఒకటి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం సమస్యకు చెక్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికల్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ఉదయం సమయంలో చక్కటి బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవడం ద్వారా మధుమేహం సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చని వెల్లడించింది.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినని వాళ్లకు కొవ్వు కలిగిన పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినాలని అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచిన రెండు గంటల్లో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మంచిది. కొవ్వు లేని మాంసం, చేపలు, ఎండు పప్పులు, ముడి ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకుంటే మధుమేహం సమస్య దూరం చేసుకోవచ్చు. ఉదయం చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలు లేదా కూరగాయల ముక్కలు ఉండేలా చూసుకోవాలి.
ఒక రకం పప్పుతో కాకుండా రకరకాల పప్పులతో వంటకాలు చేసుకుంటే మంచిది. గోధుమ పిండి కాకుండా మల్టీ గ్రెయిన్ ఆటా వాడితే మంచిది. వంటల కోసం సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ రిచ్ ఆయిల్ ను వాడితే మంచిది. అల్పాహారం తిన్న తర్వాత స్వీట్లు తినకుండా పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పండ్ల రసాలు, జామ్ లు, తేనె, బట్టర్, ఇతర తీపి పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా మధుమేహం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.