https://oktelugu.com/

Asthma: మీరు ఆస్తమాతో బాధ పడుతున్నారా.. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?

Asthma: చలికాలంలో ఆస్తమా రోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చలికాలంలో ఆస్తమా రోగులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే ఆస్తమా రోగులు ఇబ్బందులు పడక తప్పదు. చలికాలంలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. చలికాలంలో చలి వల్ల శ్వాసకోశ నాళాలు కుంచించుకుపోయే అవకాశం ఉంది. ఫలితంగా ఆస్తమా రోగులకు సమస్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆస్తమా రోగులు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఆస్తమాతో బాధపడేవాళ్లు […]

Written By: , Updated On : December 1, 2021 / 08:25 AM IST
Follow us on

Asthma: చలికాలంలో ఆస్తమా రోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చలికాలంలో ఆస్తమా రోగులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకోకపోతే ఆస్తమా రోగులు ఇబ్బందులు పడక తప్పదు. చలికాలంలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. చలికాలంలో చలి వల్ల శ్వాసకోశ నాళాలు కుంచించుకుపోయే అవకాశం ఉంది. ఫలితంగా ఆస్తమా రోగులకు సమస్య పెరుగుతుంది.

Asthma

Asthma

ఇలాంటి పరిస్థితిలో ఆస్తమా రోగులు ప్రత్యేక జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఆస్తమాతో బాధపడేవాళ్లు తప్పనిసరిగా తమతో పాటు ఇన్ హేలర్ ను తీసుకొని వెళ్లాలి. సమస్య పెరిగిన సమయంలో ఇన్ హేలర్ సహాయంతో సమస్యకు సులువుగా చెక్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇన్ హేలర్ ద్వారా పీల్చే ఔషధం సహాయంతో సంకోచించిన శ్వాసనాళాలను తిరిగి వాటి రూపానికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో చాలా ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు?

ఇన్ హేలర్ సహాయంతో తక్కువ సమయంలోనే ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇన్ హేలర్ ను ఉపయోగించే విషయంలో మొత్తం 4 దశలు ఉండగా తొలి దశలో ఊపిరిని వదలాలి. రెండో దశలో దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ఇన్ హేలర్ తో ఔషధంను సరిగ్గా పీల్చాలి. ఇలా చేయడం ద్వారా ఔషధం పూర్తిగా ఊపిరితిత్తులకు చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

మూడో దశలో ఇన్ హేలర్ ను పీల్చుకున్న తర్వాత పది సెకన్ల పాటు శ్వాసను ఆపుకోవాల్సి ఉంటుంది. నాలుగో దశలో సులభంగా ఇన్ హేలర్ ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. చలికాలంలో కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. శరీరం వెచ్చగా ఉండాలని అనుకుంటే చలికాలంలో వెచ్చని దుస్తులను మాత్రమే ధరిస్తే మంచిది.

Also Read: ఈ గింజలు తింటే మధుమేహం కు చెక్ పెట్టవచ్చు.. అవేంటంటే?