Oversleeping Side Effects: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర ఉండాలనే సంగతి తెలిసిందే. నిద్ర ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి. వయస్సును బట్టి నిద్రించే సమయంలో స్వల్పంగా మార్పులు ఉంటాయి. నిద్ర తక్కువైతే హైబీపీతో పాటు ఇమ్యూనిటీ పవర్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. నిద్ర తగ్గితే ఆకలి వేయకపోవడం, వాంతులు, తలనొప్పి, చికాకు, ఇతర లక్షణాలు కనిపిస్తాయి.
చర్మం పాలిపోవడం, ముడతలు ఏర్పడటం లాంటి లక్షణాలు సైతం నిద్ర తక్కువైన వాళ్లలో కనిపిస్తాయి. అలా కాకుండా ఎక్కువ సమయం నిద్రపోతే వారిలో డెత్ రేట్స్ ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెల్లడైంది. ఎవరైతే ఎక్కువ సమయం నిద్రపోతారో వాళ్లను గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లు ఆకలిని నియంత్రించుకోలేరు.
Also Read: కేసీఆర్ తో విభేదాల తరువాత మరో వివాదంలో చిన జీయర్ స్వామి.. మండిపడుతున్న స్వాములు
ఫలితంగా ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లను అధిక బరువు సమస్యలు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లను మానసిక సమస్యలు కూడా వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లకు కండరాళ్లపై ఒత్తిడి పడే అవకాశం ఉండటంతో పాటు వెన్నునొప్పి వేధించే అవకాశాలు ఉంటాయి.
ఎక్కువ సమయం నిద్రపోతే ఆకలి, దాహంగా ఉండటంతో పాటు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని సమాచారం. ఎక్కువ సమయం నిద్రపోయే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.