https://oktelugu.com/

Actor Nadhiya: నదియా గురించి మీకు తెలియని నిజాలు.. వింటే ఆశ్చర్య పోతారు..

Actor Nadhiya:  నదియా అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్త అంటే మాత్రం అందరు ఈజీగా గుర్తు పడతారు. అంతలా ఈమె ఒకే సినిమాతో టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అయ్యింది. అయితే ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ఇప్పటి అందాల అత్తమ్మ అప్పుడు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. ఈమె తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ గా నటించింది.   తెలుగులో కూడా […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 24, 2022 / 04:18 PM IST
    Follow us on

    Actor Nadhiya:  నదియా అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్త అంటే మాత్రం అందరు ఈజీగా గుర్తు పడతారు. అంతలా ఈమె ఒకే సినిమాతో టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అయ్యింది. అయితే ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ఇప్పటి అందాల అత్తమ్మ అప్పుడు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. ఈమె తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ గా నటించింది.

     

    Actor Nadhiya

    తెలుగులో కూడా ఒక రెండు సినిమాలు చేసింది. అయితే రాశి కంటే వాసి ముఖ్యమని నదియా విషయంలో రుజువైంది. తక్కువ సినిమాలు చేసిన కూడా ఈమె పేరు మాత్రం మారుమోగి పోయింది. అంతలా ఈమె గుర్తింపు తెచ్చుకుంది. మరి ఈమె గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    Also Read:  హీరోయిన్ ర‌వ‌ళి సినిమాల్లోకి ఎలా వ‌చ్చింది.. ఎందుకు మానేసింది.. ఇప్పుడు ఏం చేస్తుంది..?

    ఈమె అసలు పేరు జరీనా.. ముంబై ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి.. అక్కడే ప్రాధమిక, మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. నదియా 1984లో మలయాళ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో మోహన్ లాల్ కు జోడీగా నటించింది. 1985లో వచ్చిన పూవ్ పుచూడవ అనే సినిమాతో కోలీవుడ్ లోకి అడుగు పెట్టింది. స్టార్ హీరోలందరితో నటించిన నదియా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే 1988లో బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్ ను వివాహం చేసుకుంది.

    ఆ తర్వాత ఈమె అమెరికాలో సెటిల్ అయ్యింది. ఈ దంపతులకు 1996లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు సనమ్.. అనంతరం మళ్ళీ ఐదేళ్ల తర్వాత రెండవ అమ్మాయి జానా కు జన్మనిచ్చింది. ఇద్దరు కూతుర్లు అయినా ఇప్పటికి నదియా అందం ఏ మాత్రం తగ్గలేదు. మళ్ళీ 2004లో నదియా తమిళ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో 2013లో ప్రభాద్ అమ్మగా మిర్చి సినిమాతో పునః ప్రవేశం చేసింది.

    Actor Nadhiya

    ఆ తర్వాత పవర్ స్టార్ తో చేసిన అత్తారింటికి దారేది సినిమా అయితే ఈమెకు స్టార్ యాక్ట్రెస్ అయ్యే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే ఈమె అందరికి పరిచయం అయ్యేలా చేసింది. ఆ తర్వాత కూడా ఆమె మంచి మంచి సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. ఈమె టాలీవుడ్ వరుస సినిమాలు చేస్తూ భారీ పారితోషికాన్ని కూడా అందుకుంటుంది.

    Also Read: వ‌డ్డె న‌వీన్ బ‌యోగ్ర‌ఫీ.. ఒక‌ప్పుడు స్టార్ హీరోగా ఉన్న న‌వీన్ ఇప్పుడు సినిమాల‌కు దూరంగా ఉండ‌డానికి గ‌ల కార‌ణాలేంటి..?

     

    Tags