https://oktelugu.com/

Tea: చల్లని టీని మళ్లీ వేడి చేసి తాగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

ఎక్కువసార్లు వేడి చేసిన టీ తాగడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీంతో మలబద్దకం, కడుపు తిమ్మిరి సమస్యలు వస్తాయి. అలాగే ఎసిడిటీ, బీపీ, అల్సర్లు, ఆందోళన, మొటిమలు రావడం, బాడీ డీహైడేషన్, ఎముకలు బలహీన పడటం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2024 / 06:08 AM IST

    Tea

    Follow us on

    Tea: టీ అంటే చాలామందికి మక్కువ ఎక్కువ. అవసరమైతే భోజనం చేయడం మానేస్తారు ఏమో కానీ.. టీ తాగడం మాత్రం మానేయరు. మన దేశంలో టీ ప్రేమికులు చాలామంది ఉన్నారు. కొందరు నీరు తాగినట్టూ టీను తాగుతుంటారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు ఇచ్చిన టీ తాగుతుంటారు. పొద్దున్న లేచిన వెంటనే, మళ్లీ వర్క్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు టీ తాగకపోతే వాళ్లు అసలు పనికూడా చేయలేరు. అంతలా టీకి అలవాడపడతారు. తాగిన ప్రతిసారి టీ ఎన్నిసార్లు చేయాలని కొందరు చేసిన టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ పదార్థాన్నైనా ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు పోతాయి. దీంతో అనారోగ్య పాలవుతారు. మళ్లీ మళ్లీ టీని వేడి చేసి తాగడం వల్ల కలిగే నష్టాలేంటో చూద్దాం.

    ఎక్కువసార్లు వేడి చేసిన టీ తాగడం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీంతో మలబద్దకం, కడుపు తిమ్మిరి సమస్యలు వస్తాయి. అలాగే ఎసిడిటీ, బీపీ, అల్సర్లు, ఆందోళన, మొటిమలు రావడం, బాడీ డీహైడేషన్, ఎముకలు బలహీన పడటం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసార్లు టీని వేడి చేయడం వల్ల అందులో క్యాన్సర్‌ను కలిగించే బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ రకమైన తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. పదేపదే టీను వేడి చేయడం వల్ల అది శరీరానికి పాయిజన్‌లా పనిచేస్తుంది. టీ చేసిన 15 నిమిషాల వరకు తాగవచ్చు. అంత కంటే ఎక్కువ సమయం తర్వాత తాగితే ప్రమాదం. టీ ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల అందులో టానిన్ల సాంద్రత పెరుగుతుంది. దీంతో టీ చేదుగా మారుతుంది. అయితే టానిన్లు శరీరానికి అంత ప్రమాదం కాదు. కానీ వీటిని అధికమొత్తంలో తీసుకోవడం శరీరానికి అనారోగ్యం. టీ పాలతో చేయడం వల్ల బ్యాక్టీరియా తొందరగా పెరుగుతుంది. అందులో మళ్లీ చక్కెర ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా తొందరగా ఏర్పడుతుంది. ఇలాంటి టీ తాగడం చాలా ప్రమాదకరం. కాబట్టి మళ్లీ మళ్లీ వేడి చేసిన టీ తాగవద్దు.

    ఇంట్లో తయారు చేసిన కూరలు మిగిలిపోయిన తర్వాత కొందరు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. మళ్లీ తినాలనుకున్నప్పుడు వాటిని వేడి చేసి తింటారు. ఇలా వేడి చేసి తినడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదట. ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల ఇందులో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తాయి. రకరకాల వ్యాధులకు కారణం అవుతాయి. ముఖ్యంగా నూనె పదార్థాలను, పాలకూర వంటి వాటిని అస్సలు వేడి చేసి తినకూడదు. వేడి చేయడం వల్ల ఇందులోని పోషకాలు పోతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి కష్టమైన ఎప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్‌గా తినడం అలవాటు చేసుకోండి.