Credit Cards: క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం లేదా..! ఇలా చేస్తే మీకే బ్యాంకులు రోజుకు రూ. 500 చెల్లించాలి.. ఆర్బీఐ ఈ నిబంధన తెలుసుకోండి..!

మీకు క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉన్న సందర్భంలో అందులో కొన్నింటిని క్యాన్సిల్ చేయాలని అనుకుంటారు. ఇలా చేస్తే వార్షిక రుసుముల పేరుతో ఖర్చు తగ్గుతుంది. అయితే కార్డును క్లోజ్ చేసేందుకు బ్యాంకులు విముఖత చూపుతాయి. లేదంటే కాలం గడుపుతుంది.

Written By: Chai Muchhata, Updated On : August 17, 2024 10:34 pm

Credit Cards

Follow us on

Credit Cards: క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. కేంద్రం డిజిటల్ మనీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో బ్యాంకులు ఇబ్బడి ముబ్బడిగా క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. దీంతో ఒక్క వ్యక్తి వద్ద ఐదు, ఆరు బ్యాంకులకు సంబంధించి కార్డులు ఉంటున్నాయి. అయితే రాను రాను క్రెడిట్ కార్డులు విధించే వార్షిక రుసుంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కార్డు తీసుకునేప్పుడు ఎలాగైనా వాడుతాం.. అనుకున్నా.. ఆఫర్లు, రివార్డు పాయింట్లు సరిగా లేకపోవడంతో వాడకం బంద్ చేస్తున్నారు. దీంతో క్లోజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే బ్యాంకులు మాత్రం వీటిని క్లోజ్ చేసుకోకుండా రుసుములు తగ్గించడం, లిమిట్ పెంచడం చేస్తూ కొనసాగిస్తున్నాయి. కార్డును ఎన్నిసార్లు క్లోజ్ చేసుకోవాలని అనుకున్నా బ్యాంకులు సహకరించడం లేదు. మీరు ఇలా చేస్తే బ్యాంకులు దిగివస్తాయి. లేదంటే రూ. 500 మీకు చెల్లిస్తుంటాయి. కార్డును క్లోజ్ చేయడానికి బ్యాంకు విముఖత చూపితే ఆర్బీఐ ఈ నిబంధన తెలుసుకోవాలి. వాస్తవానికి, క్రెడిట్ కార్డును మూసివేయడంలో బ్యాంకు ఆలస్యం చేస్తే, వినియోగదారులకు ప్రతి రోజూ రూ .500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధన ఉంది. మీరు క్రెడిట్ కార్డును కలిగి ఉండి.. మీరు దానిని ఉపయోగించకుంటే.. దాన్ని క్లోజ్ చేయాలని అనుకుంటే ఈ వార్త మీ కోసం. క్రెడిట్ కార్డును త్వరగా క్లోజ్ చేసేందుకు.. లేదా క్రెడిట్ కార్డును క్లోజ్ చేసే ప్రక్రియను ఆలస్యం చేసేందుకు బ్యాంకులు రోజులకు రోజులు కాలం గడుపుతూనే ఉంటాయి. ఆ సమయంలో వినియోగదారులు ఇబ్బంది పడతారు. చివరికి వారు కాల్ చేసి మరో కార్డు అంటూ అంటగడతారు. ఇక ఈ విధానం చెల్లదు. ఆర్బీఐ స్పష్టంగా దీనిపై వివరించింది.

మీకు క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉన్న సందర్భంలో అందులో కొన్నింటిని క్యాన్సిల్ చేయాలని అనుకుంటారు. ఇలా చేస్తే వార్షిక రుసుముల పేరుతో ఖర్చు తగ్గుతుంది. అయితే కార్డును క్లోజ్ చేసేందుకు బ్యాంకులు విముఖత చూపుతాయి. లేదంటే కాలం గడుపుతుంది. ఆర్బీఐ దీనిపై ఏమందంటే? వాస్తవానికి, క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడంలో బ్యాంకు ఆలస్యం చేస్తే, వినియోగదారుడికి ప్రతి రోజూ రూ .500 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, ఒక కస్టమర్ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయమని రిక్వెస్ట్ పెడితే.. 7 రోజుల్లో ప్రక్రియను ప్రారంభించాలి. కార్డు జారీ చేసే బ్యాంకు లేదా సంస్థ అలా చేయలేకపోతే, 7 రోజుల వ్యవధి తర్వాత, రోజుకు రూ .500 జరిమానా.. ఈ మొత్తాన్ని కస్టమర్ కు చెల్లించాలి. 2022లో ఆర్బీఐ ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. అయితే, క్లోజ్ చేస్తున్న సమయంలో క్రెడిట్ కార్డులో ఎటువంటి బకాయిలు ఉండకూడదని గమనించాలి.

క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం కష్టమైన పనేమీ కాదు. మీరు క్రెడిట్ కార్డును సులభంగా క్లోజ్ చేయవచ్చు. ఏదైనా క్రెడిట్ కార్డు క్లోజ్ చేసే ముందు దాని బకాయిలు పైసాతో సహా చెల్లించాలి. బకాయిలు చెల్లించే వరకు క్రెడిట్ కార్డు క్లోజ్ కాదు. చాలా మంది క్రెడిట్ కార్డును క్లోజ్ చసేందుకు ముందు రివార్డు పాయింట్లను రిడీమ్ చేయరు. మీరు ఖర్చు చేయడం ద్వారా ఈ పాయింట్ సంపాదించారు. అటువంటి పరిస్థితిలో ఈ పాయింట్లను వాడుకోవడం మీ హక్కు.

ఇన్సూరెన్స్ ప్రీమియం, ఓటీటీ మంత్లీ చార్జీ లేదా మరేదైనా రికరింగ్ చెల్లింపుల కోసం చాలాసార్లు తమ క్రెడిట్ కార్డుపై స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ పెడతారు. మూసివేసే ముందు వీటిని పూర్తిగా క్లియర్ చేయాలి. ఇప్పుడు మీరు బ్యాంకుకు కాల్ చేసి క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాలి. అనంతరం వివరాలు అడిగి తెలుసుకొని ఆ తర్వాత ప్రక్రియను ప్రారంభిస్తారు.
దీని తర్వాత, మీ కార్డు క్లోజ్ చేసినప్పుడు ఎటువంటి సమాచారం బయటకు వెళ్లకుండా కట్ అవుతుంది.